ముందు జాగ్రత్తలతో కేన్సర్‌ నివారణ: కలెక్టర్‌ | Sakshi
Sakshi News home page

ముందు జాగ్రత్తలతో కేన్సర్‌ నివారణ: కలెక్టర్‌

Published Thu, Feb 29 2024 7:48 PM

-

సాక్షి, సిటీబ్యూరో: కేన్సర్‌కు నిర్దిష్టమైన మందులు లేవని, అది రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు ఉత్తమమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కేన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన మహిళలు స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపించుకోవాలని, దీనితో రానున్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చన్నారు. సర్వైకల్‌, బ్రెస్ట్‌ కేన్సర్లను ముందుగా గుర్తిస్తే సత్వర చికిత్స ద్వారా స్వస్థత పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నిర్మలా ప్రభావతి, ఎంఎన్‌జే కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత, గైనిక్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ లీల, డాక్టర్‌ శాలిని, డాక్టర్‌ స్వప్న, పారామెడికల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement