ఆకట్టుకున్న ఎర్త్‌ ఫెస్టివల్‌ 2024 | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ఎర్త్‌ ఫెస్టివల్‌ 2024

Published Mon, Feb 19 2024 8:34 PM

- - Sakshi

మాదాపూర్‌: మాదాపూర్‌లోని సీసీఆర్టీలో ఆదివారం నిర్వహించిన ఎర్త్‌ఫెస్టివల్‌ 2024 ఆకట్టుకుంది. కళాకారులు భూమిమంగళం నృత్య ప్రదర్శనతో అలరించారు. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫెస్టివల్‌ను వాతావరణ మార్పులు, స్థిరత్వం, క్లిష్టమైన సమస్యలపై యువత, చిన్నారులకు అవగాహన కల్పించారు. ఏర్పాటు చేశారు. షార్ట్‌ఫిలిం, ఎర్త్‌ నేపథ్యంతో పాటలను పాడి అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మిల్లెట్‌ బ్యాంక్‌ ఫుడ్‌ స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరాభి అకాడమికి చెందిన 35మంది చిన్నారుల వయోలిన్‌ సింఫోనీ గ్రాండ్‌ ఫినాలే సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. నాట్య మయూరి కూచిపూడి డాన్స్‌ అకాడమీ సౌందర్య కౌసిక్‌ శిష్యబృందం భూమి మంగళం కూచిపూడి నృత్య ప్రదర్శన సందర్శకులను ఆలరించింది. నైనిజమ్‌ పెయింటింగ్‌, మిల్లెట్స్‌, ఆర్ట్‌, వర్క్‌షాప్‌తో పాటు పలు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

అలరించిన వయెలిన్‌ సింఫోని, భూమి మంగళం కూచిపూడి నృత్యప్రదర్శన

పెయింటింగ్స్‌, మిల్లెట్‌ ఫుడ్‌ స్టాల్స్‌, అవగాహన కార్యక్రమాలు

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement