20 శాతం రిజర్వు సిబ్బంది

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ హోళికేరీ  - Sakshi

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హోళికేరి

పోలింగ్‌ సిబ్బందితో కలెక్టరేట్‌లో సమీక్ష

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ సిబ్బందితో రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు,ఐఏఎస్‌ చంద్రకాంత్‌ కృష్ణారావు, ఐఏఎస్‌లు.. రామ్‌కుమార్‌,శిల్పగుప్తాపర్యవేక్షించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులను, ఓపీఓలను ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించారు. ఇప్పటికే వీరికి పలు విడతలుగా ఎంపిక చేసిన కేంద్రాల్లో మాస్టర్‌ ట్రైనర్స్‌చే పోలింగ్‌ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించామని కలెక్టర్‌ వివరించారు. అదే విధంగా జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 3,369 పోలింగ్‌ కేంద్రాలుండగా.. పోలింగ్‌ విధుల కోసం సిబ్బందిని నియమించినట్లు..దీంతోపాటు 20శాతం రిజర్వు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించిన బృందంలో ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారితో పాటు పోలీసు సిబ్బంది కూడా ఉంటారని, ప్రతి నియోజకవర్గం పరిధిలో పోలింగ్‌ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 5 పోలింగ్‌ కేంద్రాల చొప్పున.. మహిళా బృందం, ఒక దివ్యాంగుల బృందం, యువతతో కూడిన పోలింగ్‌ బృందాలను ఎంపికచేశామన్నారు. అనంతరం మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, నోడల్‌అధికారి రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top