వర్షంలో ఒంటి కాలిపై నిల్చొని.. | Sakshi
Sakshi News home page

వర్షంలో ఒంటి కాలిపై నిల్చొని..

Published Tue, Sep 5 2023 6:44 AM

ఆందోళన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు  - Sakshi

సుల్తాన్‌బజార్‌: ఎన్‌హెచ్‌ఎం స్కీంలో ప్రభుత్వ యూపీహెచ్‌సీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్స్‌, పీహెచ్‌సీ డీఈఓ, పీహెచ్‌ఎం, సపోర్టింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కోఠి డీఎంహెచ్‌ఎస్‌ క్యాంపస్‌ ఆవరణలో సోమవారం వర్షంలో ఒంటికాలిపై నిలుచుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్‌హెచ్‌ఎంస్కీంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ కార్డులు జారీ చేయాలని, ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. 510 జీఓలో విలీనం చేయాలన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళనలో పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, శ్రీమణి, శ్రీలక్ష్మి, భార్గవి, లోకేష్‌, ప్రకాష్‌, బాల్‌రెడ్డి, లోకేష్‌, సురేష్‌, హనుమంతు, మధు, శిరీష, నరసింహులు, సునీల్‌, పల్లవి, మాధవి, లావణ్య, భారతి, గౌరీ, చంద్రకళ, అనసూయ, రమేష్‌, హైదరాబాద్‌ మేడ్చల్‌, రంగారెడ్డి, జిల్లాల ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న ఆందోళన

Advertisement
 
Advertisement