రామన్నపేట : వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మత్తు ఇంజక్షన్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్, హనుమకొండ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు పి. శ్రవణ్‌కుమార్, జె. కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో చార్‌బౌలికి చెందిన మహ్మద్ అబ్దుల్ సోహైబ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసైన్స్ లేని ప్రాంగణంలో నిల్వ ఉంచిన 38 వయల్స్ టెర్మిన్ ఇంజక్షన్లు (విలువ రూ.15,872) పట్టుకున్నారు. టెర్మిన్ ఇంజక్షన్లు అలవాటు మాదకద్రవ్య ఆధారితతకు దారితీసే ప్రమాదకర ఔషధమని, వైద్యుల సూచన మేరకే వినియోగించాలని సహాయ సంచాలకురాలు రాజ్యలక్ష్మి హెచ్చరించారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
దామెర: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెట్టుపల్లి విజేందర్ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇంటి నిర్మాణానికి కొంత అప్పు చేశాడు. ఎలా తీర్చాలో తెలియక మద్యానికి బానిపై మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మంగళవారం వెల్లడించారు.


