వైద్యులు రాకముందే వెయింగ్ తీసుకున్నారు. 200 గ్రాములు ఎక్కువ ఉన్నావని తెలపడంతో ఎంపికకు ఇంకా సమయం ఉందని గ్రౌండ్ వర్కవుట్ చేశా. ఆ తర్వాత మరోసారి వెయింగ్ కోసం వస్తే ఆలస్యమైందని చెప్పి బాక్సింగ్ హాల్ నుంచి బయటకు పంపారు. ఇప్పటి వరకు నేను రెండు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఒక మెడల్ సాధించా. ఎప్పుడూ ఇలా జరగలేదు.
రాజేశ్, బుద్దారం, ములుగు జిల్లా
సమయపాలన తప్పనిసరి
క్రీడాకారులకు సమయపాలన, క్రమశిక్షణ తప్పనిసరి. ఎంపికలు ఉన్నాయని తెలిసి సదరు క్రీడాకారుడు గంటన్నర ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఎంపికలకు అనర్హుడిగా తేల్చి పంపాం. కొందరు కోచ్‌లు నిబంధనలు తెలియకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తద్వారా క్రీడాకారులు నష్టపోతారని మరిచిపోతున్నారు.
రవీందర్‌కుమార్, అధ్యక్షుడు, వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్


