విద్యారణ్యపురి : వరంగల్‌లోని రంగశాయిపేట ఆర్టీఓ జంక్షన్ సమీపంలోని ములుగు, మహబూబాబాద్ మహాత్మాజ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలల్లో (ఎంజేపీబీసీ)లో ఈవిద్యాసంవత్సరం( 2026–2027)లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌వీఎన్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల విద్యార్థినులు కూడా ఈ కళాశాలల్లో అడ్మిషన్లు పొందొచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ కళాశాలకు ఆప్షన్ ఇవ్వని విద్యార్థినులు నేరుగా ఈ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు పొందొచ్చని తెలిపారు. తమ ఒరిజనల్ విద్యార్హతల సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. ఈ కళాశాలల్లో బీకాంసీఏ, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీపీఎస్, ఎంఎస్‌సీఎస్, ఎంఎస్‌డీఎస్, బీజెడ్‌సీ, బీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలని కోరారు. వివరాలకు 9866610429, 9676817038, 8130594460 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
అనాథపిల్లలకు అండగా బాలవికాస
● 250 మంది గ్రామీణ పేదలకు
ఆర్థికసాయం
కాజీపేట రూరల్ : సమాజంలో పాఠశాలలకు వెళ్లే అనాథ పిల్లలకు బాలవికాస సంస్థ అండగా ఉంటుందని జనవికాస అధ్యక్షుడు లూర్థు మర్రెడ్డి అన్నారు. ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్‌లో మంగళవారం బాలవికాస, సోపార్ మద్దతుతో నడుస్తున్న ఆరు జిల్లాలకు చెందిన గ్రామీణ పేద అనాథ విద్యార్థులు 250 మందికి రూ.7,50,000 లక్షల విలు వైన కిరాణా సరుకులు, స్టడీ కిట్లు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు క్రమశిక్షణ నై పుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ప్రము ఖ వక్త విజయ్ జక్కోజు మాట్లాడుతూ యువతకు భవిష్యత్ బాలవికాస మార్గదర్శకమన్నా రు. కోఆర్డినేటర్లు, బాలవికాస మహిళా ప్రో గ్రాం సభ్యులు జ్యోతి, అమూల్య పాల్గొన్నారు.


