ఆనందపు ఆటలు.. | - | Sakshi
Sakshi News home page

ఆనందపు ఆటలు..

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కాజీపేట మండలం సోమిడి శివారులోని తాళ్లపద్మావతి ఒలంపియాడ్‌ పాఠశాలలో కంప్యూటర్‌ శిక్షణ పొందుతున్నారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కంప్యూటర్‌లో ఎంఎస్‌ వర్డ్‌, పెయింట్‌, ఎక్సెల్‌ నేర్చుకుంటున్నారు. ప్రతీ రోజు 20 మందికిపైగా శిక్షణకు హాజరవుతున్నారు.

–కాజీపేట

సోమిడి మైదానంలో ఆడుకుంటున్న పిల్లలు

కంప్యూటర్‌ నేర్చుకుంటున్న విద్యార్ధులు

నేను

గీసిన

బొమ్మ

వేసవి సెలవుల్లో బాలబాలికలు ఖాళీగా ఉండకుండా పలు క్రీడలు, కళలు నేర్చుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా బొమ్మలు గీయడంపై ఆసక్తి కనబర్చుతున్నారు. వివిధ రకాల చిత్రాలు గీస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.

కాజీపేట : వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని సోమిడి, టేకులగూడెం, మడికొండ, తరాలపల్లి, కడిపికొండ తదితర గ్రామాల్లో బాలబాలికలు క్రికెట్‌, ఖోఖో, వాలీబాల్‌ తదితర ఆటలు ఆడుతున్నారు. దీంతో గ్రామాల్లో ఏ వీధిలో, ఏ మైదానంలో చూసినా పిల్లలతో కళకళలాడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement