చదువుతోపాటు క్రీడల్లోనూ.. కృష్ణవేణి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడల్లోనూ.. కృష్ణవేణి

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

కేయూ క్యాంపస్‌ : మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈనెల 2 నుంచి 5 వరకు నిర్వహించిన సెకండ్‌ ఏషియన్‌ పారాత్రోబాల్‌ చాంపియన్‌ షిప్‌ –2026 పోటీల్లో భారతదేశ టీమ్‌తో పోటీల్లో పాల్గొన్న కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌అండ్‌ బిజినెస్‌మేనేజ్‌మెంట్‌ విభాగం పరిశోధకురాలు మాచర్ల కృష్ణవేణి ప్రతిభ చాటారు. ఈ టీమ్‌ కాంస్య పతకం సాధించింది. ఇందులో మాచర్ల కృష్ణవేణి వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఎల్లగౌడ్‌, హైమావతి దంపతుల కుమార్తె కృష్ణవేణి. తండ్రి ప్రైవేట్‌గా డ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి.

చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి..

కృష్ణవేణికి చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉంటూనే క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. గతంలో హనుమకొండ సు బేదారి దివ్యాంగుల హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. ప్ర స్తుతం హైదరాబాద్‌లోని ది వ్యాంగుల ఉమెన్స్‌ హోమ్‌లో ఉంటున్నారు. పారా త్రో బాల్‌, తైక్వాండో పోటీల్లో శిక్షణ కూడా పొందుతున్నారు.

పీహెచ్‌డీ పూర్తిచేయాలనే లక్ష్యం..

కేయూ కామర్స్‌అండ్‌ బిజినెస్‌మేనేజ్‌మెంట్‌ విభాగంలో ప్రస్తుతం పరిశోధకురాలుగా పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్లు కావొస్తోంది. ఈఏడాది డిసెంబర్‌లో పూ ర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు కృష్ణవేణి తెలి పారు. భవిష్యత్‌లో పారా ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనాలని ఉందని, ఆ దిశగానే కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.

ఏషియన్‌ పారా త్రోబాల్‌ పోటీల్లో ప్రతిభ

కాంస్య పతకం అందుకున్న కృష్ణవేణి

Advertisement
 
Advertisement
Advertisement