బాల్యం.. రంగుల లోకం | - | Sakshi
Sakshi News home page

బాల్యం.. రంగుల లోకం

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

పాఠశాలకు సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లలంతా టీవీ, మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోవడం సాధారణం. కానీ, ఆ సమయాన్ని వృథా చేయకుండా తల్లిదండ్రులు కొద్దిగా శ్రద్ధ పెడితే పిల్లల్లోని అద్భుత సృజనాత్మకత (క్రియేటివిటీ) బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన గూడూరి ప్రశాంత్‌రెడ్డి, మనోరంజిత దంపతుల కూతురు యూకేజీ చదువుతున్న దాక్షిణ్యారెడ్డి తన ఊహకు రంగులద్దారు. రాబోయే వర్షాకాలాన్ని ఉద్దేశించి వర్షించే మేఘాలు, పచ్చని చెట్లు థర్మకోల్‌ షీట్‌పై రంగులతో వేయడంతో పాటు కాగితాలకు రంగులు వేసి జాతీయ పక్షి చిహ్నం మయూరం ఆకారం ఆకట్టుకుంది.

–భీమదేవరపల్లి

Advertisement
 
Advertisement
Advertisement