అస్తవ్యస్త ప్రణాళిక
అనాలోచిత నిర్ణయాలు.. అడ్డగోలు నిర్మాణాలు
వరంగల్ అర్బన్ : ప్లానింగ్, శాసీ్త్రయత బొమ్మాబొరుసు లాంటివి. ఈ రెండు లేకుండా ఇష్టారాజ్యంగా రూ.కోట్లు వెచ్చించి భారీ భవనాలు నిర్మించడం గ్రేటర్ వరంగల్‌కే చెల్లుబాటు అవుతోంది. ఇంజనీర్లు, ప్రణాళిక అధికారులు భవిష్యత్ తరాల అభివృద్ధికి పాటుపడాల్సి ఉండగా.. అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా అన్నిస్థాయిల్లో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఏం చేయాలన్నా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. అయితే బల్దియా అధికారులు ఎప్పుడు ఏది నిర్మిస్తారో? ఏది ఎందుకు కూలగొడతారో తెలియదు. అనాలోచిత నిర్ణయాలతో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారీ భవన నిర్మాణానికి కసరత్తు..
బల్దియా ప్రధాన కార్యాలయానికి సమీపంలోని మెప్మా ఆఫీస్ పక్కన రూ.32 కోట్ల నిధులతో ఐదు అంతస్తుల్లో భారీ భవనాన్ని నిర్మించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఈ భవనం పక్కనే కాకతీయ మ్యూజికల్ గార్డెన్, ఇండోర్ స్టేడియం, ప్లానిటోరియం, స్విమ్మింగ్‌పూల్ నిర్మాణం చేపట్టారు. అయితే, ఆయా నిర్మాణాలను ముందు చూపులేకుండా ఇష్టారాజ్యంగా చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 నుంచి 60 రకాల అవసరాలకు ఉపయోగపడే విధంగా పరిపాలన విభాగాలు, కమిషనర్, వింగ్ అధికారులు, సిబ్బందికి చాంబర్లు, మేయర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు దాదాపు 200 మంది సిట్టింగ్ సామర్థ్యంతో కౌన్సిల్ హాల్, ప్రతిపక్ష సభ్యుల చాంబర్లు, వాహనాల పార్కింగ్ డిజైన్ చేశారు. బల్దియాలో పెద్ద పనులు చేసే బడా కాంట్రాక్టర్‌కు ఇప్పటికే టెండర్ ఖరారైంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భారీ భవనానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.
గ్రేటర్ పరిపాలన భవన నిర్మాణంపై విమర్శలు
వృథాకానున్న రూ.32 కోట్ల ప్రజాధనం
పాలక, అధికార వర్గాలు ఆలోచిస్తేనే ఫలితం
అస్తవ్యస్త ప్రణాళిక


