పోలింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఎంపీడీఓలతో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కార్యక్రమంలో డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల ప్రత్యేకాధికారులు అనసూయ, శ్రీనివాసులు, నరసింహస్వామి, ఎంపీడీఓలు వీరేశం, విజయ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి
జిల్లాలో ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘స్టూడెంట్ వెల్ నెస్’ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఎంహెచ్‌ఓ అప్ప య్య, డీడబ్ల్యూఓ జయంతి, డీఐఈఓ గోపాల్, డీటీడీఓ ప్రేమకళ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్ హైదర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
అవినీతి నిరోధక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన అవినీతి వ్యతిరేక వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య, ఇన్‌స్పెక్టర్ రాజు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్


