సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Dec 8 2025 7:31 AM | Updated on Dec 8 2025 7:31 AM

సోమవా

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

కబ్జా వెనుక బడా నాయకులు!

న్యూస్‌రీల్‌

చర్యలు తీసుకుంటాం..

కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణ ం (ఇన్‌సెట్‌లో) అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు (ఫైల్‌)

రూ.కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలం కబ్జా వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్ద తలకాయలు ఉన్నట్లు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇలా ఉండగా.. రెవెన్యూ, సర్వే శాఖల్లోని కొందరు ఉన్నతాధికారులు కబ్జాదారులకు సహకరిస్తామని హామీ ఇచ్చి మరీ పోస్టులు పొందారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో పనిచేసిన తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్వోలు ఈ భూమి ప్రభుత్వానిదని బోర్డులు పెట్టి, అప్పటి నిర్మాణాలను తొలగించారు. దశాబ్దాలుగా కాపాడుతూ వచ్చారు. అయితే కాసులకు కక్కుర్తిపడిన కొందరు అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించడానికి రాజకీయ నాయకులకు సహకారం అందించారని, దాని ద్వారానే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతోందని స్థానికులు అంటున్నారు.

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోని ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించారు. దీని వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది అగ్రనేతలు ఉన్నారని, వారి ఒత్తిడితోనే అధికారులు ముందుకు రావట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే తర్వాత ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టమని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇంతకాలం కాపాడినా..

హనుమకొండ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్‌ 690లో 33 గుంటల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో చెరువు కట్ట, ప్రధాన రోడ్డు, అంతర్గత రోడ్లు పోగా కొంత ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. ఈ స్థలాన్ని గతంలో కొందరు తప్పుడు పత్రాలతో కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదికూడా మినహాయించినా అక్కడ ఇంకా మూడు గుంటల ప్రభుత్వ భూమి ఉందని సర్వే డిపార్ట్‌మెంట్‌ స్పష్టం చేసింది. దీని ఆధారంగా కొన్ని రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే కబ్జా కోరులు రెవెన్యూ అధికారులు బోర్డు పెట్టిన రోజు రాత్రి ఆ బోర్డును తొలగించి, స్థలాన్ని చదును చేసి కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అధికారులు కనీసం పోలీసు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీసింది.

సమీప సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్‌..

గతంలో బతుకమ్మ ఆడడంతో ఈ స్థలాన్ని బతుకమ్మ బండ అని పిలిచేవారు. బతుకమ్మ ఆడినట్లు ఫొటోలు, ఆధారాలు కూడా గ్రామస్తుల వద్ద ఉన్నాయి. కొంతకాలం తర్వాత పరిస్థితి అనుకూలించకపోవడంతో అక్కడ బతుకమ్మ ఆడడం ఆపేశారు. ఆ తర్వాత క్రమంగా కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. క్రమక్రమంగా పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ, తమకు కావాల్సిన అధికారులను తీసుకొచ్చి రహస్యంగా పనులు చక్కబెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పక్క సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని విమర్శలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదు.

నిర్మాణాలను అడ్డుకున్న గ్రామస్తులు

కొద్దిరోజుల క్రితం రాత్రికి రాత్రి ఇక్కడ నిర్మాణాలు జరుగుతుండగా అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి సమస్య వివరించారు. ఊరంతా ఏకమై నిర్మాణదారులపై తిరగబడ్డారు. అయితే, అప్పట్లో నిర్మాణాలను ఆపిన కబ్జాదారులు తర్వాత క్రమంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని నిర్మాణాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతా అన్యాక్రాంతం అయినా.. చివరకు మూడు గుంటలు ప్రభుత్వ భూమి ఉందని నిర్ధారించిన అధికారులు ఆభూమిని కాపాడే చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు ఊతమిస్తోంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

నిర్మాణాలు కనిపించకుండా అడ్డుగా పెట్టిన రేకులు

అక్కడ మూడు గంటల ప్రభుత్వ స్థలం ఉంది. సర్వేయర్‌ రిపోర్టు ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ స్థలమని ఏర్పాటు చేసిన బోర్డును కొందరు తొలగించారు. ఈ విషయం మా దృష్టికి రాగానే ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.

– దశరథ రాంరెడ్డి, హనుమకొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

హనుమకొండ నడిబొడ్డున ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు

కొంతమంది అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకుల దందా

పట్టించుకోని రెవెన్యూ అధికారులు.. స్థలం స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్‌

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20251
1/3

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20252
2/3

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20253
3/3

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement