ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● రోడ్డు ప్రమాదాల్లో 377 మంది మృతిచెందితే అత్యధికంగా 128 మంది బైకర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 90 మంది వరకు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారుంటే, మైనర్లు కూడా 12 మంది ఉన్నారు. మిగిలిన 26 మంది 45ఏళ్లపైబడిన వారు.
● ఆ తర్వాత అత్యధికంగా రోడ్లు, డివైడర్లు క్రాస్ చేస్తూ.. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న 85 మంది పాదచారులు వివిధ ప్రమాదాల్లో మృతిచెందారు. వీరిలో 26 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే ఎక్కువ శాతం మంది ఉన్నారు.
● కార్లు, జీపులు, వ్యాన్లు వాహనాల్లోని 42 మంది, లారీల్లోని 32 మంది, సైకిల్స్ నడుపుతున్న పది మంది, ఆటోరిక్షాల్లోని ఏడుగురు, బస్సుల్లోని ఐదుగురు, ఈ–ఆటోరిక్షాలోని నలుగురు మృతి చెందారు. 64 మంది ఇతర వాహనాలకు చెందిన వారున్నారు.
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆ మూడు గంటల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో 271 ప్రమాదాలు జరిగి 84 మంది మృతిచెందగా... మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో 270 ఘటనలు జరిగి 65 మంది చనిపోయారు. ఆ సమయాల్లో డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలను ఈ గణాంకాలు చెబుతున్నాయి. సాయంత్రం సమయంలోనే వాహనాలు ఎక్కువగా రోడ్డు మీదకు రావడం, గమ్యస్థానాలకు తొందరగా చేరుకోవాలనుకునే క్రమంలో అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తమకు ఏం సంబంధం లేని ఎదుటివారి ప్రాణాలను బలిగొంటున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు అంటే పది నెలల కాలంలో 1,250 రోడ్డు ప్రమాదాలు జరిగితే 377 మంది మృతి చెందగా, 1,253 మంది క్షతగాత్రులయ్యారని ట్రాఫిక్ పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండడంతోపాటు ట్రాఫిక్ నియమాలను పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతారని పోలీసులు అంటున్నారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు
271
84
240
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో
జనవరి నుంచి అక్టోబర్ వరకు 1,250 రోడ్డు ప్రమాదాలు
మృతులు 377, క్షతగాత్రులు 1,253
అప్రమత్తతోపాటు ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే
సురక్షితంగా గమ్యస్థానాలకు
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


