ఇద్దరు సర్పంచ్‌లు ఏకగ్రీవం
జయగిరి సర్పంచ్
ఏకగ్రీవానికి
రూ.50 లక్షల ఆఫర్
8
లోu
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలంలో ఇద్దరు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అలాగే, అర్వపల్లి సర్పంచ్ ఏకగ్రీవం కాగా, కొత్తపల్లి సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరిగింది.
కొత్తపల్లి జీపీ పాలకవర్గం ఏకగ్రీవం
కొత్తపల్లి సర్పంచ్ దండి సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్‌గా చిరంజీవి, వార్డు సభ్యులుగా వేముల మానస, పుట్ట నర్మద, అన్న బాలయ్య, అన్న తిరుపతి, పుట్ల నీల ఎన్నికయ్యారు.
అర్వపల్లి సర్పంచ్‌గా ప్రభాకర్
అర్వపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా అంబాల ప్రభాకర్ ఏకగ్రీవమయ్యారు. అన్ని వార్డు సభ్యులకు పోటీ అనివార్యమైంది.
ఫలించిన సీనియర్ల చర్చలు
ఏకగ్రీవానికి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్ నర్సంహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఉదయ్‌కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మదన్‌గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఎల్లేష్ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపారు. బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన దండి సాంబయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు.
గంటూరుపల్లి కాంగ్రెస్ బలర్చిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ
గంటూరుపల్లి కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో నామినేషన్ వేసిన చాణిక్యరెడ్డి పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రాకేష్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకుని మద్దతు ప్రకటించారు. 1వ వార్డు స్థానంలో లోకనబోయిన దేవిక, 2వ వార్డు కడిపికొండ పల్లవి, 4వ వార్డు సుంకరి రాంరెడ్డి, 5వ వార్డు కొండ సోమయ్య, 6వ వార్డు గంట రమణారెడ్డి, 7వ వార్డు పోరెడ్డి, వాణి, 8వ వార్డు మడపల్లి రాజు ఏకగ్రీవమయ్యారు. 3వ వార్డుల్లో గన్నోజు రవీందర్, పురుషోత్తం మధ్య పోటీ అనివార్యమైంది. సీతంపేటలోని 3వ వార్డులో గిన్నారపు స్వప్న, 4వ వార్డులో గిన్నారపు సంధ్య ఏకగ్రీవమయ్యారు.
ఇద్దరు సర్పంచ్‌లు ఏకగ్రీవం


