ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి
న్యూశాయంపేట: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా సాగేలా నోడల్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో నియమించిన నోడల్ అధికారుల విధులపై వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి విడత నామినేషన్లు పూర్తై స్క్రూటీని జరుగుతోందని, అదేవిధంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద


