రెండో రోజు నామినేషన్ల స్వీకరణ
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత పోలింగ్ జరగనున్న ఐదు మండలాల్లోని 73 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు సోమవా రం రెండో రోజు 170 నామినేషన్లు వచ్చాయి. అదేవిధంగా 694 వార్డులకు 350 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానా లకు 221 నామినేషన్లు, వార్డు సభ్యులకు 694 394 నామినేషన్లు అధికారులకు అందినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజు సోమవారం నామినేషన్ల జోరు పెరిగింది. దుగ్గొండి మండలంలో 34 సర్పంచ్ స్థానాల్లో 46, 282 వార్డు సభ్యుల స్థానాల్లో 75 నామినేషన్లు, నల్లబెల్లి మండలంలోని 29 సర్పంచ్ స్థానాల్లో 45 నామినేషన్లు, 252 వార్డు సభ్యుల స్థానాల్లో 71, గీసుకొండ మండలంలోని 21 సర్పంచ్ స్థానాల్లో 54 నామినేషన్లు, 188 వార్డు సభ్యుల స్థానాల్లో 113 నామినేషన్లు, సంగెం మండలంలో 33 సర్పంచ్ స్థానాల్లో 70 నామినేషన్లు, 286 వార్డు సభ్యుల స్థానాలకు 164 నామినేషన్లు దాఖలు అయ్యాయి.


