హెచ్‌ఐవీపై అపోహలు తొలగించాలి
ఎంజీఎం: హెచ్‌ఐవీపై అపోహలు తొలగించాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభిరామారావు సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వరంగల్ భద్రకాళి ఆలయ ఆర్చ్ నుంచి కేఎంసీలోని ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియం వరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్ విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి పట్టాభిరామారావు మాట్లాడారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అదనపు డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌రావు, ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్‌చంద్రారెడ్డి, కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ రమేశ్‌చంద్ర, జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, టీబీ నియంత్రణ అధికారి హిమబిందు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌రెడ్డి, ప్రభుదాస్, జిల్లా ఎయిడ్స్ ని యంత్రణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ సీహెచ్ సుధాకర్, రామకృష్ణ, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
సమష్టితత్వంతో చెడు అలవాట్లు దూరం
గతంలో కుటుంబ వ్యవస్థ సమష్టిగా ఉండడం వల్ల చెడు అలవాట్లకు గురికాకుండా చూసుకునేవారని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. ఎయిడ్స్ డేను పురస్కరించుకుని వరంగల్ డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు ఆధ్వర్యంలో కేఎంసీ గేట్ నుంచి ఐఎంఏ హాల్ వరకు సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని న్యాయమూర్తి నిర్మలాగీతాంబ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఐఎంసీ హాల్‌లో ఎయిడ్స్ నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచందర్ రెడ్డి, సీకేఎం సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


