లేబర్‌కోడ్‌ల రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి
హన్మకొండ: లేబర్ కోడ్‌ల రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పల్లా రవీందర్‌రెడ్డి భవన్‌లో సోమవారం సీఐటీయూ హనుమకొండ జిల్లా రెండో మహాసభ ప్రారంభమైంది. ముందుగా సీఐటీయూ పతకాన్ని ఆవిష్కరించి భాస్కర్ మాట్లాడారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మరింత ఉధృతంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి, ఎల్‌సీ, గనులు, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు. మహాసభలో భవిష్యత్ ఉద్యమాలకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, కాసు మాధవి, కూరపాటి రమేశ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, కార్యదర్శి రాగుల రమేశ్, ఆఫీస్ బేరర్స్ జి.ప్రభాకర్ రెడ్డి, మెట్టు రవి, పుల్లా అశోక్, సంఘాల మొగిలి, బొల్లారం సంపత్, కె.ఐలయ్య, రజిత, బి.మహేశ్, ఉద్యోగులు కార్మికులున్నారు.
లేబర్ కోడ్లు రద్దు చేయాలి..
ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మికుల నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షుడు కూరపాటి రమేశ్, కార్యదర్శి కాసు మాధవి డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ ఉర్సు గుట్ట సీపీఎం జిల్లా కార్యాలయం రామ సురేందర్ భవనంలో ఎండీ.బషీర్, బోళ్ల కొమురయ్య, చాకలి కోమల అధ్యక్షతన సీఐటీయూ జిల్లా పదో మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ బషీర్, కార్యదర్శిగా అరూరి కుమార్, కోశాధికారి జన్ను ప్రకాశ్, ఉపాధ్యక్షులు గడ్డం రమేశ్, ఇనుముల శ్రీనివాస్, సింగారపు కృష్ణ, తుమ్మల సాంబయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాలడుగు భాస్కర్


