
ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరి
వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
ఎంజీఎం: గర్భిణులు అన్ని పరీక్షలతోపాటు ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రసవానికి ముందు 9వ నెలలో ఎయిడ్స్ పరీక్షలు చేయించుకుంటే మంచి ఫలితాలుంటాయని వరంగల్ జిల్లా వైద్యాధికారి సాంబశివరావు సూచించారు. ఐఎంఏ హాల్‌లో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్, కంట్రోల్ యూనిట్ అధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని, ఎయిడ్స్ నివారణకు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎంజీఎం, నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రిలో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. డీడబ్ల్యూఓ ప్రోగ్రాం అధికారి మోహన్‌సింగ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ స్వప్నమాధురి, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, ఐసీటీసీ సూపర్‌వైజర్ రామకృష్ణ, అసిస్టెంట్ అకౌంటెంట్ కమలాకర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులున్నారు.