ఫ్రీజర్లకు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

ఫ్రీజర్లకు మరమ్మతులు

Aug 6 2025 8:27 AM | Updated on Aug 6 2025 8:27 AM

ఫ్రీజ

ఫ్రీజర్లకు మరమ్మతులు

ఎంజీఎం: ఎంజీఎం మార్చురీ విభాగంలో ఫ్రీజర్ల మరమ్మతులు ప్రారంభమైనట్లు ఆస్పత్రి పర్యవేక్షకుడు కిషోర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజులుగా ఫ్రీజర్లు పనిచేయక మృతదేహాలను భద్రపర్చేందుకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో.. కలెక్టర్‌ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించి రూ.4.95 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. ఈపనుల్ని సర్ఫ్‌ సైంటిఫిక్‌ సంస్థ చేస్తున్నట్లు, ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలు చూసుకోనున్నట్లు పేర్కొన్నారు. మార్చురీ విభాగంలో శవాల భద్రతతో కూడిన నిర్వహణ కోసం మార్చురీ కమ్‌ ఫ్రీజర్ల ఏర్పాటు చేయడం, అవసరమైన పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

జిల్లాలో 1,02,554

కొత్త పింఛన్లు

హన్మకొండ అర్బన్‌: జిల్లా పరిఽధిలో 1,02,554 చేయూత పింఛన్లు మంజూరైనట్లు హైదరాబాద్‌ సెర్ఫ్‌ డైరెక్టర్‌ గోపాల్‌రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన చేయూత (ఆసరా) పెన్షన్ల పంపిణీపై అధికారులకు అవగాహన, శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాల్‌రావు మాట్లాడుతూ.. తాజాగా ప్రవేశపెట్టిన ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ వినియోగం, పింఛన్ల పంపిణీ విధానం, నిబంధనలు, నిర్వహణపై అధికారులకు వివరించారు. ఇప్పటికే జిల్లాకు మంజూరైన వాటిలో 44,597 పెన్షన్లు (54 శాతం) పోస్టల్‌ శాఖ ద్వారా ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌తో లబ్ధిదారులకు జూలై నుంచి పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, డీఆర్‌ఓ వై.వి గణేశ్‌, బల్దియా డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ అధికారులు పాల్గొన్నారు.

నిట్‌తో థాయ్‌లాండ్‌

ఏఐటీ ఎంఓయూ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌తో థాయ్‌లాండ్‌ ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మంగళవారం వర్చువల్‌గా ఎంఓయూను కుదుర్చుకుంది. నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లోని కార్యాలయంలో ఎంఓయూపై సంతకం చేయగా.. థాయ్‌లాండ్‌లోని ఏఐటీలో డీన్‌ సంగమ్‌ శ్రేష్ట సంతకం చేశా రు. రెండేళ్ల పాటు కొనసాగే ఎంఓయూ ద్వారా 20 మంది విద్యార్థులు ఏఐటీలో పరిశోధనలతోపాటు మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తెలిపారు.

జూడో రాష్ట్ర స్థాయి

పోటీలు షురూ

రామన్నపేట: వరంగల్‌ నగరం 22వ డివిజన్‌లోని కెమిస్ట్‌ భవన్‌లో మంగళవారం జూడో రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈపోటీల్లో 480 మంది క్రీడాకారులు పాల్గొనగా.. వివిధ వెయిట్‌ కేటగిరీల్లో గెలుపొందిన బాలబాలికలు సబ్‌ జూనియర్‌ విభాగంలో బిహార్‌లో, కెడిట్‌ విభాగంలో ఉత్తరప్రదేశ్‌ లక్నోలో జరిగే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు జూడో రాష్ట్ర స్థాయి సంఘం అధ్యక్షుడు కై లాస్‌ యాదవ్‌ పోటీలు ప్రారంభించారు. అనంతరం పోటీలు కొనసాగాయి. కివి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గులాం సర్వర్‌ మున్నాభాయ్‌, రాజ్‌కుమార్‌, సోమరాజు, సంతోశ్‌, వీరస్వామి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌ వసతుల

కోసం కొటేషన్ల ఆహ్వానం

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో తాత్కాలికంగా ప్రారంభించనున్న స్పోర్ట్స్‌ స్కూల్‌ కమ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, హాస్టల్‌లో వసతుల కల్పన కోసం సీల్డ్‌ కొటేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉడెన్‌ డైనింగ్‌ టేబుల్స్‌, ఐరన్‌ కాట్‌ విత్‌ ఫైవుడ్‌, పరుపులు, బెడ్‌షీట్లు, పిల్లోస్‌, ఇతర ఫర్నిచర్స్‌, స్పోర్ట్స్‌ మెటీరియల్‌ సప్లై కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 8వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు జిల్లా క్రీడల, యువజన కార్యాలయంలో కొటేషన్లు సమర్పించాలని సూచించారు.

ఫ్రీజర్లకు మరమ్మతులు1
1/2

ఫ్రీజర్లకు మరమ్మతులు

ఫ్రీజర్లకు మరమ్మతులు2
2/2

ఫ్రీజర్లకు మరమ్మతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement