
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలో స్కానింగ్ సెంటర్లు ఉన్న అన్ని ఆస్పత్రులు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా.. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ, అబార్షన్లు నిర్వహించే వారి సమాచారాన్ని తెలి యజేసేందుకు సంబంధిత ఫోన్ నంబర్ 63000 30940 ను క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ప్రతీ ఆశా కార్యకర్త, అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ.. లీగల్ వలంటీర్ల ద్వారా లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 8 సెంటర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, ఏసీపీ నరసింహారావు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య, బన్ను ఆరోగ్య సేవల సొసైటీ ప్రతినిధి నీతి, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మంజుల, డెమో అశోక్‌రెడ్డి, ప్రసన్నకుమార్, కళ్యాణి, పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో హెల్త్‌చెకప్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో విద్యా, సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఈఓ డివాసంతి, డీఐఈఓ ఎ.గోపాల్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య పాల్గొన్నారు.
ఇళ్ల పనులు ఇంకెన్నాళ్లు?
క్రితం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు? ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారు? అని కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశ్నించారు. పెంబర్తిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించినప్పటికీ గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇసుక కూడా సరఫరా చేయలేదని లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ పీడీ సిద్ధార్థనాయక్ తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ రవి, ఎంపీఓ కర్ణాకర్‌రెడ్డి, ఏఈ సరిత పాల్గొన్నారు.