
మత్తు పదార్థాలతో జీవితం చిత్తు
విద్యారణ్యపురి: మత్తు పదార్థాల వినియోగంతో జీ వితాలు చిత్తవుతాయని, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని హనుమకొండ జిల్లా లీగల్ సర్వీ సెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా లీగల్ స ర్వీసెస్ అథారిటీ, నార్కొటిక్ బ్యూరో జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యలో న్యాయ విజ్ఞాన సదస్సు, డ్ర గ్స్ అబ్యూస్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మత్తు పదార్థాల వినియోగం పల్లెలకు కూ డా సోకిందని తెలిపారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్య త తామందరిపై ఉందని గుర్తుచేశారు. డ్రగ్స్ వాడ కం వలన కలిగే నష్టాలను వీడియో ద్వారా నార్కొటిక్ బ్యూరో వరంగల్ డీఎస్పీ సైదులు అవగాహన కల్పించారు. సమావేశంలో కేడీసీ ప్రిన్సిపాల్ ప్రొఫె సర్ శ్రీనివాస్, జిల్లా న్యాయసేవా సంస్థ సెక్రటరీ క్ష మాదేశ్ పాండే, యాంటీ నార్కొటిక్ వరంగల్ పోలీ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శశికాంత్, సభ్యులు సమత, గంగిశెట్టి శ్రీనివాస్, గన్‌సింగ్, విద్యార్థి విభాగం సభ్యులు గునవర్ధన్, ప్రత్యూష, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, అధ్యాపకులు ఇందిర, సీతారాం, సంధ్యారాణి, రవికుమార్, చిన్నా పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి...
కాజీపేట అర్బన్: ప్రజల సమస్యల పరిష్కరానికి కమ్యూనిటీ మోటివేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు తెలిపారు. హంటర్‌రోడ్డులోని వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు భవన సముదాయంలో పద్మశాలి కమ్యూనిటీ మోటివేషన్ సెంటర్‌ను ఆయ న శనివారం ప్రారంభించారు.కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ క్షమాదేశ్ పాండే, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బార్ కౌన్సిల్ మెంబర్ దుస్సా జనార్ధన్, హనుమకొండ, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుదీర్‌కుమార్, న్యాయవాదులు గంజి గణేష్, పొరండ్ల రాజయ్య, మోటివేటర్ బాల్నె శరత్‌బాబు, వడ్నాల నరేందర్, ప్రెస్ క్లబ్ అ ధ్యక్షుడు వేముల నాగరాజు పాల్గొన్నారు.
జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పట్టాభిరామారావు