
ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావుకు అవార్డు
కేయూ క్యాంపస్: సేవాజ్యోతి లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు 2025ను కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్‌ఎం విభాగం ప్రొఫెసర్ పెద్దమళ్ల శ్రీనివాస్‌రావు అందుకున్నారు. హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో ఆదివారం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి చేతుల మీదుగా ఈఅవార్డును శ్రీనివాస్‌రావు అందుకున్నారు. రెండేళ్ల ప్రాయంలోనే పోలియో వచ్చి దివ్యాంగుడైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఆయన కష్టపడి చదువుకున్నారు. కేయూలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆవిభాగాధిపతిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలోనే ఏపీలో దివ్యాంగుల సంక్షేమం పథకాల పనితీరుపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు. దివ్యాంగుల సమస్యలపై కూడా అనేక పోరాటాలు చేశారు. ‘ఎ సొసైటీ ఫర్ రైట్స్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్స్’ చైతన్యం చేసే సంస్థను ఆయన నడుపుతున్నారు.