
సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష
కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ చక్కని వేదిక అని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంఘానికి, సభ్యులకు
న్యాయం చేస్తాం
వరంగల్ చౌరస్తా: వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి, సభ్యులకు న్యాయం చేస్తామని సంఘం జాతీయ నాయకుడు గట్టు మహేశ్‌బాబు తెలిపారు. వరంగల్ ఆర్‌ఎన్‌టీ రోడ్డులోని ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం తాత్కాలిక పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. అడ్వకేట్ల నడుమ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంఘం కమిటీని విస్తరించి, సభ్యుల సాదకబాధకాలు, సంఘం ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కార్యక్రమంలో అడ్వకేట్లు చకిలం ఉపేందర్, అంజనీదేవి, సంఘం నాయకులు మునుగోటి రమేశ్, తాటికొండ రాము, పుల్లూరి మధు, తోట నవీన్, రమేశ్, ప్రవీణ్, ఆకారపు హరీశ్, శోభన్, ఉపేందర్, శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడు
రాములుకు పురస్కారం
విద్యారణ్యపురి: హనుమకొండలోని లష్కర్‌బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సీహెచ్. రాములు మహాత్మాగాంధీ జాతీయ చరఖా అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రకాశంహాల్‌లో గాంధీ జ్ఞాన ప్రతి ష్టన్ స్వర్ణోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో నిష్టాతులైన మేధావులు, కళాకారులను జిల్లాకు ఒకరి చొప్పున 33 మందిని ఎంపిక చేసి అవార్డులు అందజేశారు. గాంధీ భావాలు, ఆలోచనలను తన సాహిత్య రచనల ద్వారా సమాజానికి అందించిన సేవలకు హనుమకొండ జిల్లా నుంచి ఉపాధ్యాయుడు రాములును సాహిత్య శిరోమ ణి బిరుదు, అవార్డుతో సన్మానించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇరువర్గాల
మధ్య ఘర్షణ
హసన్‌పర్తి: ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో డివిజన్ ముచ్చర్లకు చెందిన అధికార పార్టీ నాయకుడితోపాటు అదే ప్రాంతానికి చెందిన మట్టెడ చంటికి మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈక్రమంలో ఎర్రగట్టుగుట్ట సమీపంలో ఇరువర్గాలు రాళ్లతో దాడులకు దిగినట్లు స్థానికులు చెప్పారు. ఈ దాడిలో మట్టెడ చంటికి బలమైన గాయాలైనట్లు వారు పేర్కొన్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెప్పారు.

సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష

సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష