
వనజీవి పరిచయంతో..
కాజీపేట: పద్మశ్రీ వనజీవి రామయ్యతో ఏర్పడిన పరిచయం ఓ యువకుడి ఆలోచన ధోరణిని మార్చివేసి పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయించింది. కాజీపేట పట్టణానికి చెందిన కొలిపాక ప్రకాశ్‌కు ఐదేళ్లక్రితం ఓ రోజు రామయ్య పరిచయమైంది. దీంతో అతను ప్రకాశ్ మేధిని అనే సంస్థను స్థాపించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడం, నాటించడం చేయిస్తున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటూ వాటి ఆవరణల్లో మొక్కలు నాటించడం చేస్తున్నారు. ఇప్పటివరకు 10వేల మొక్కలను నాటించడంలో సఫలీకృతుడైన ప్రకాశ్ అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతాడని ఆశిద్దాం..