
మద్యం తాగి వాహనాలు నడపొద్దు : సీపీ
వరంగల్ క్రైం : మద్యంతాగి వాహనాలు నడపొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వాహనదారులను హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులుగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 490 కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. 22 మందికి రెండ్రోజుల చొప్పున జైలుశిక్ష, మిగతా వారికి రూ.4,46,800 జరిమానా విధించారని పేర్కొన్నారు. హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 182 కేసులు నమోదు కాగా, 8మందికి జైలుశిక్ష, వరంగల్‌లో 126 కేసులు నమోదు కాగా 9 మందికి జైలు, కాజీపేటలో 125 కేసులు కాగా ఐదుగురికి జైలు శిక్ష పడిందని వివరించారు. వాహనదారులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే వరంగల్ కమిషనరేట్ పోలీసుల లక్ష్యమని సీపీ పేర్కొన్నారు.

మద్యం తాగి వాహనాలు నడపొద్దు : సీపీ