
● ఆషాఢమాసమంతా అతివల సందడి ● శరీరానికి మేలు చేసే గోరింటా
హన్మకొండ కల్చరల్ : గోరింటాకును గౌరిదేవి ప్రతీకగా భావిస్తారు. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి గోరింటాకును ఒకరికొకరు చేతులకు పెట్టుకోవడం.. అక్కచెల్లెల్లు, వదిన మరదల్ల మధ్య ప్రేమానురాగాలు పరిమళిస్తాయి. కాలనీల్లో, అపార్టుమెంట్లలో మహిళలు ఒకచోట చేరి గోరింటాకు నూరి చేతులకు పెట్టుకుంటారు. దీంతో స్నేహితుల మధ్య అనుబంధం బలపడుతుంది. అదేవిధంగా గోరింటాకు అందంతోపాటు ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే మహిళలు ఇంట్లో గోరింటాకు పెట్టుకుని సందడి చేస్తుంటారు. హనుమకొండ పూరిగుట్టలోని సాయినగర్‌కాలనీలో మహిళలు ఆషాఢమాసం సందర్భంగా శనివారం ఒక్కచోటకు చేరారు. సంప్రదాయబద్ధంగా గోరింటాకు సేకరించి రోలులో వేసి నూరారు. అనంతరం పాటలు పాడుతూ ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఆనందంతో మురిసిపోయారు.
●
గోరింటాకు మంగళకరమైనది..
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది మన ఆచారం. గోరింటాకు గౌరి ఇంటి ఆకు కాబట్టి మంగళకరమైనది. గోరింటాకు ఎరుపు చూసి కుంకుమ బాధ పడుతుందట.. నన్నెవరు చూస్తారని అప్పుడు గౌరిదేవి గోరింటాకు శరీరభాగాలలో ఎక్కడైనా పండుతుంది కానీ, నుదుట మాత్రం పండదని, నుదుటకుంకుమ మాత్రమే ఎర్రగా ఉండాలని వరమిచ్చిందట.. ఇలా గోరింటాకుపై పురాణగాథలు ఉన్నాయి.
–రత్నమాల, ఎకై ్సజ్‌కాలనీ, హనుమకొండ