
కళారంగంపై ఆసక్తి పెంచుకోవాలి
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
హన్మకొండ కల్చరల్ : యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కళారంగంపై ఆసక్తి పెంచుకోవా లని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సూచించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం రెండ్రోజుల పాటు నిర్వహించే సకల కళలు సంబురాల జాతర–2025 శనివారం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో ప్రారంభమైంది. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వాహకులు జడల శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ సారయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కళలు మన సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనమన్నారు. జడల శివ మాట్లాడుతూ తెలంగాణ నలుమూలల నుంచి వెయ్యి మంది కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. సకల కళలు సంబురాల జాతరలో భాగంగా కూచిపూడి, జానపద, హరికథ, బుర్రకథ, చిందు యక్షగానాలు, నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో పీఆర్ ప్రసాద్, ఆలేటి శ్యాంసుందర్, కల శ్రీనివాస్, జనగాం రాము, ఆకులపల్లి చిరంజీవి, రాము, సాయి పాల్గొన్నారు.

కళారంగంపై ఆసక్తి పెంచుకోవాలి