
పెంట్‌హౌజ్ ఓ బృందావనం..
రామన్నపేట : వరంగల్ ట్రాిఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తన ఇంటి పై అంతస్తును ఓ బృందావనంగా మార్చేశారు. రామకృష్ణ గురుకులంలో విద్యనభ్యసిస్తున్న క్రమంలోప్రకృతి ప్రేమికుడిగామొక్కలతో గడుపుతుండే వారు. వృత్తిరీత్యా బదిలీపై ఎక్కడికెళ్లినా తన ఇంట్లో సామన్లతోపాటు 40 రకాల మొక్కలను వెంట తీసుకెళ్తారు. ప్రస్తుతం తాను నివాసముంటున్న భీమారం సమీపంలోని సత్యసాయి కాలనీలో తన ఇంట్లోని పై అంతస్తు(పెంట్ హౌజ్)లో తిప్ప తీగ, మింట్ తులసి,స్నేక్ ప్లాంట్,మిస్ లిల్లి, వాము మొక్కలు, శంకుపుష్పాలు, మునగతోపాటు వివిధ పూలమొక్కలు పెంచుతున్నారు.
గంట కేటాయిస్తా..
నేను గురుకులంలో చదివా. ఆ రోజుల్లో మొక్కల పెంపకం అలవడింది. మొక్కల సంరక్షణకు రోజూ తప్పనిసరిగా గంట పాటు సమయం కేటాయిస్తా. వాటిని మనం కాపాడితే.. మనల్ని అవి కాపాడుతాయి. – రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్

పెంట్‌హౌజ్ ఓ బృందావనం..