ఒక్కరు లేదా ఇద్దరు.. | - | Sakshi
Sakshi News home page

ఒక్కరు లేదా ఇద్దరు..

Jul 11 2025 12:45 PM | Updated on Jul 11 2025 2:51 PM

One or Two Childs only

‘సాక్షి’ సర్వేలో స్పష్టీకరణ

అంతకంటే ఎక్కువ కనలేమంటున్న యువ జంటలు

ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే సంతోషం

 ‘ఒక్కరు.. లేదా ఇద్దరు పిల్లలు చాలు. అంతకంటే ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవు. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని అంటున్నాయి యువజంటలు. దీంతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. మారిన జీవన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఈ తరం ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ వచ్చే ఇరవై ఏళ్లలో యువజనుల జనాభా తగ్గి, సీనియర్‌ సిటిజన్ల సంఖ్య పెరుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురికి పైగా.. బిడ్డల్ని కనాలన్న సూచనలు వస్తున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనే విషయంలో యువజంటలు ఏమంటున్నాయి.. వీరితో పాటు 25 ఏళ్ల పైబడి వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారి మనోగతంపై ‘సాక్షి’ గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు అంశాలపై సర్వే నిర్వహించింది.

సర్వే ఇలా.. శాంపిల్స్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల నుంచి పది మంది చొప్పున

1. మీరు ఎంత మంది పిల్లలను కనాలని అనుకుంటున్నారు?

ఒక్కరు - 15

ఇద్దరు - 40

ముగ్గురు.. అంతకంటే ఎక్కువమంది - 5

2. ఉమ్మడి కుటుంబమా.. ఒంటరిగా ఉండడం ఇష్టమా?

ఉమ్మడి కుటుంబం - 36

భార్యాభర్తలు విడిగా ఉండడం - 24 

3. పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనే ప్లాన్‌ ఎలా చేస్తారు?

వెంటనే కనేలా - 24

సంవత్సరం తర్వాత - 26

రెండేళ్ల తర్వాత - 18

4. ఈ తరంలో ఒక్కరు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు ఎందుకు?

భార్యాభర్తలు జాబ్ చేయడం -16

పిల్లలను చూసుకునే వారు లేక - 24

ఆర్ధికంగా ఇబ్బందులు వస్తాయని - 20

– సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement