బాధ్యతలు స్వీకరించిన అడిషనల్‌ కమాండెంట్‌ | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన అడిషనల్‌ కమాండెంట్‌

Published Sat, Feb 24 2024 1:42 AM

- - Sakshi

మామునూరు: ఖిలా వరంగల్‌ మండలం మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌గా ఎంజీఎస్‌ ప్రకాశ్‌రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వర్తించిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్‌రావు కమాండెంట్‌ శివప్రసాద్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అడిషనల్‌ కమాండెంట్‌ను పలువురు పోలీస్‌ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

నేటి దివ్యాంగుల గ్రీవెన్స్‌ రద్దు

కాజీపేట అర్బన్‌/కాళోజీ సెంటర్‌ : హనుమ కొండ, వరంగల్‌ కలెక్టరేట్లలో శనివారం నిర్వహించే దివ్యాంగులు, వయోవృద్ధుల ప్రత్యేక గ్రీవెన్స్‌ ను రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లాల జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారులు మధురిమ, ఎం.శారద శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రతి నాలుగో శనివారం నిర్వహించే ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌ను మేడారం జాతర నేపథ్యంలో రద్దు చేస్తున్నామని, ప్రజలు గమనించాలని కోరారు.

కేయూ పరిధిలో ఎంసీఏ

మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ ఫస్టియర్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) మార్చి 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాధిక తెలిపారు. మొదటి రోజు సోమవారం ఫస్ట్‌ పేపర్‌, 6న సెకండ్‌ పేపర్‌, 11న థర్డ్‌ పేపర్‌, 13న ఫోర్త్‌ పేపర్‌, 15న ఫిఫ్త్‌ పేపర్‌ పరీక్షలు ఉంటాయన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు.

నేటి నుంచి టీసీసీ పరీక్షలు

విద్యారణ్యపురి: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు(టీసీసీ) పరీక్షలు ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీఈఓ ఎండీ.అబ్దుల్‌హై, ఏసీజీఈ చలపతిరావు శుక్రవారం తెలిపారు. డ్రాయింగ్‌ కోర్సు వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30, మఽ ద్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు, టైలరింగ్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 434 మంది పరీక్షలు రాయనున్నారని, ఇందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌, లష్కర్‌బజార్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష రాసేవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.తెలంగాణ.గౌట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో జిల్లా, ట్రేడ్‌, పేరు, పుట్టిన తేదీ ఎంటర్‌ చేసి హాల్‌ టికెట్‌ పొందాలని సూచించారు. టైలరింగ్‌ పరీక్షకు సొంత కుట్టుమిషన్‌లు తెచ్చుకోవాలని, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతి లేదని స్పష్టం చేశారు.

గ్రేటర్‌ కమిషనర్‌ బదిలీ

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా బదిలీ అయ్యారు. ఆయనను జనగామ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎవరినీ నియమించలేదు. షేక్‌ రిజ్వాన్‌ బాషా.. ఆదిలాబాద్‌ జిల్లా అదన పు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా పనిచేసే క్రమంలో ఉత్తమ శానిటేషన్‌ నిర్వహణకు ముక్రా కేర్‌ గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ జీపీగా ఎంపికైంది. 2023 మే 23న వరంగల్‌ బల్దియా కమిషనర్‌గా విధుల్లోచేరిన రిజ్వాన్‌ బాషా సమర్ధవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు.

ఐలోని మల్లన్న హుండీ

ఆదాయం రూ.1.76 కోట్లు

ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు శుక్రవారం దేవాదాయ శాఖ పరిశీలకులు జి.సంజీవరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. జనవరి 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 23 వరకు హుండీలో రూ.44,46,004, టికెట్ల ద్వారా రూ.1,32,02,165 మొత్తం రూ.1,76,48,169 నగదు సమకూరినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని వాటిలోనే వేసి సీల్‌ చేశామని చెప్పారు. లెక్కింపు కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునారెడ్డి, మునిగాల రాజు, రాకేష్‌, మహబూబాబాద్‌ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

ప్రకాశ్‌రావు
1/1

ప్రకాశ్‌రావు

Advertisement
Advertisement