జ్వాలామాలినిగా అమ్మవారు | Sakshi
Sakshi News home page

జ్వాలామాలినిగా అమ్మవారు

Published Fri, Feb 23 2024 1:34 AM

- - Sakshi

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో నిర్వహిస్తున్న శిశిర నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని గురువారం జ్వాలామాలినిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అర్చకులు ఝెల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు చేశారు. లలితా జయంతిని పురస్కరించుకుని అమ్మవారికి 2.11 లక్షల గాజులను సమర్పించి అర్చన చేశారు. ఆలయ చైర్మన్‌ వద్దిరాజు వెంకటేశ్వర్‌రావు పర్యవేక్షించారు.

కేయూ పరిధి కళాశాలలకు

నేడు సెలవు

కేయూ క్యాంపస్‌: మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడివరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల కళాశాలలు, కార్యాలయాలకు ఈనెల 23న సెలవు ప్రకటిస్తూ కేయూ రిజిస్ట్రార్‌ పి.మల్లారెడ్డి గురువారం సర్క్యూలర్‌ జారీచేశారు. ఈ సెలవుకు బదులుగా మార్చి 9న(రెండో శనివారం) పనిదినంగా ప్రకటించారు. వర్సిటీలో ఇప్పటికే ప్రకటించిన పరీక్షలు ఉంటే అవి యథావిధిగా కొనసాగుతాయని, ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

విద్యను ప్రైవేటీకరించొద్దు

కేయూ క్యాంపస్‌: విద్యారంగాన్ని ప్రైవేటీకరించొద్దని టీజీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చిర్రరాజు అన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే అఖిలభారత విద్యార్థుల సదస్సుకు సంబంధించిన పోస్టర్లను గురువారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఆవిష్కరించి మాట్లాడారు. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం విద్యపై తీసుకున్న నిర్ణయాలపై మేధావి వర్గం, వర్సిటీల్లో చర్చ పెట్టాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీచేయాలని, విద్యార్థుల పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భారత్‌ బచావో వరంగల్‌ జిల్లా నాయకులు వెంగల్‌రెడ్డి, విద్యార్థి నాయకులు నగేష్‌గైక్వాడ్‌, తాడబోయిన జితేందర్‌, వడ్లకొండ మధన్‌చంద్రబోస్‌, భరత్‌, పరమేష్‌,సందీప్‌, రామ్‌, చరణ్‌, అనిల్‌ పాల్గొన్నారు.

సమ్మక్క–సారలమ్మ జిల్లాగా

నామకరణం చేయాలి

హన్మకొండ కల్చరల్‌: ములుగు జిల్లాకు శ్రీ స మ్మక్క–సారలమ్మ జిల్లాగా నామకరణం చే యాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోరిక ఈశ్వర్‌సింగ్‌ నాయక్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని సమితి కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు నవీన్‌నాయక్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తల్లుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, జాతరను పూర్తిస్థాయిలో ఆదివాసీ సంప్రదా యంలోనే నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ సమ్మయ్య, టీడీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌సింగ్‌ నాయ క్‌, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌సింగ్‌ నాయక్‌,సమ్మయ్య నాయక్‌, శంకర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష ఫీజు చెల్లించాలి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఫార్మా డి ఒకటి నుంచి ఐదవ సంవత్సరం (పీబీ) సప్లిమెంటరీ,, ఇంప్రూవ్‌మెంట్‌ రాసే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 2 వరకు, రూ.250 అపరాధ రుసుముతో మార్చి 5వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేయూఆన్‌లైన్‌.కో.ఇన్‌ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చని తెలిపారు.

రేపు సామూహిక వ్రతాలు

హన్మకొండ కల్చరల్‌: మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని హంటర్‌రోడ్‌లోని అభయాంజనేయస్వామి దేవాలయంలో శనివారం ఉదయం 9 గంటలకు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ డీపీపీ జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్‌ రామిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం దేవాలయంలో సంబంధిత ప్రచార బ్యానర్‌ ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్‌ మార్త రాజేందర్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement