స్టాంప్‌ వెండర్‌ అనుమతికి 25సార్లు తిరిగా.. | Sakshi
Sakshi News home page

స్టాంప్‌ వెండర్‌ అనుమతికి 25సార్లు తిరిగా..

Published Tue, Feb 20 2024 1:18 AM

పురుషుల విభాగంలో చాంపియన్‌గా నిలిచిన వరంగల్‌ జట్టు - Sakshi

ఏసీబీని ఆశ్రయించిన బాధితుడి ఆవేదన

వరంగల్‌ క్రైం : స్టాంప్‌ వెండర్‌ అనుమతికి జిల్లా రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ చుట్టూ 25సార్లు తిరిగా.. అయినా అనుమతి ఇవ్వకపోవడంతో విసిగి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు జిల్లా రిజిస్ట్రార్‌కు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడు. సోమవారం జిల్లా రిజిస్ట్రార్‌ను కలిసిన ఏసీబీ అధికారులను ఆశ్రయించడానికి స్టాంప్‌ వెండర్‌ లైసెన్స్‌ ఇచ్చే సంబంధిత అధికారి ఏడాదిగా వేధించిన తీరును డీఆర్‌కు విన్నవించుకున్నాడు. సాక్షిలో ఈనెల 15న ప్రచురితమైన‘ ఏసీబీలో లీకువీరులు’ కథనం అవినీతి నిరోధక శాఖతో పాటు జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ప్రకంపనలు సృష్టించింది. ఏసీబీ అధికారుల తీరుపై రాష్ట్ర ఏసీబీ ఉన్నతాధికారులు, సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ డీఐజీ మాదాసి సుభాషిణి వచ్చి కా ర్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. సోమవారం జిల్లా రిజిస్ట్రార్‌ హరికొట్ల రవి బాధితుడిని విచారణలో భాగంగా పిలవడంతో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కన్నీళ్లు పెట్టుకున్న కనికరించలేదని, వాయిదాలు పెడుతూ ఇబ్బందులకు గురిచేశారని బాధితుడు డీఆర్‌కు వివరించినట్లు తెలిసింది.

హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ వరంగల్‌, రంగారెడ్డి

ద్వితీయస్థానాల్లో హైదరాబాద్‌, వరంగల్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: 52వ తెలంగాణ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పురుషుల చాంపియన్‌గా వరంగల్‌ జట్టు, మహిళా చాంంపియన్‌గా రంగారెడ్డి జిల్లా జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో హైదరాబాద్‌ ద్వితీయ, కరీంనగర్‌ తృతీయ స్థానం సాధించగా మహిళల విభాగంలో వరంగల్‌ ద్వితీయ, కరీంనగర్‌ తృతీయ స్థానాలు సాధించాయి. కరీంనగర్‌లోని లయోలా జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలు సోమవారం రాత్రి ముగిసాయి.

Advertisement
Advertisement