‘తెలంగాణ ఉద్యమ రత్న’ పురస్కారానికి హరీశ్‌రావు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ ఉద్యమ రత్న’ పురస్కారానికి హరీశ్‌రావు ఎంపిక

Published Wed, Nov 22 2023 1:06 AM | Last Updated on Wed, Nov 22 2023 1:06 AM

-

కమలాపూర్‌: ‘తెలంగాణ ఉద్యమ రత్న 2023–24’ పురస్కారానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావును ఎంపిక చేసినట్లు శ్రీనివాస రామానుజన్‌ ఫౌండేషన్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ అమరేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీనివాస్‌ రామానుజన్‌ ఫౌండేషన్‌ 20వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకులకు పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమ రత్న అవార్డు ఇవ్వాలని సంకల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉద్యమ నాయకుడు, మంత్రి హరీశ్‌రావును ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలో ఢిల్లీలో నిర్వహించే ఎస్‌ఆర్‌ఎఫ్‌ 20వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావుకు పురస్కారం అందజేస్తామని అమరేష్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement