దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Nov 17 2023 1:16 AM

-

విద్యారణ్యపురి: తెలుగు వెలుగు జాతీయ పురస్కారాలకు ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలుగు వెలుగు సాహితీవేదిక ( టీవీ ఎస్‌వీ) జాతీయ చైర్మన్‌ పోలోజు రాజ్‌కుమార్‌, జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ వలబోజు మోహన్‌రావు, వరంగల్‌ సిటీ అధ్యక్షుడు డాక్టర్‌ పొడిశెట్టి విష్ణువర్ధన్‌ గురువారం ఒక ప్రకటనలో కోరారు. సాహిత్యం, రచన, కవులు, కళాకారులు, సంగీతం, నృత్యం, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, విద్య, వైద్యం, తదితర రంగాల్లో ఉన్నవారు పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలి పారు. ఎంపికై న వారికి ఈఏడాది డిసెంబర్‌ 10న విజయవాడలో పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు. వివరాలకు 9100174351, 94412615 85 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement