గుంటూరు
న్యూస్‌రీల్
సమీకరణకు మేం పూర్తిగా వ్యతిరేకం
ఏడు గ్రామాల రైతుల నుంచి 16,666.57 ఎకరాల సమీకరణకు సన్నద్ధం దీనికి 3,828 ఎకరాల ప్రభుత్వ భూములు అదనం రెండు విడతల బాధిత రైతులకు తప్పని తీవ్ర అసంతృప్తి విజ్ఞప్తులను పక్కనపెట్టి హడావుడిగా సమీకరణకు చంద్రబాబు సర్కారు
ముందే చెప్పి ఉంటే ఆలోచించే వాళ్లం
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కమిటీతో మేలు జరిగేనా?
కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 578.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 50,659 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1109 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 3400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 43.9865 టీఎంసీలు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తొలివిడతలో తీసుకున్న 33 వేల ఎకరాలతో ప్రపంచాన్ని తలదన్నే రాజధానిని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు సింగపూర్ మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్ మ్యాప్‌లను రూపొందించి నానా హడావుడి చేశారు. అద్భుతాలు సృష్టిస్తానని చెప్పిన బాబు అమరావతి అభివృద్ధి చెందాలంటే పెద్ద ఎయిర్ పోర్టు, స్పోర్ట్స్ సిటీ వంటివి రావాలంటూ మరోవిడత భూ సమీకరణ అన్నారు. దీంతో బాబును నమ్మి తొలివిడతలో రైతులు ఇచ్చిన భూముల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిన్న మొన్నటి వరకు పరిధి ఇక్కడి వరకే అని గుర్తించి ఎన్‌ఆర్‌ఐలు, బడా బాబులు రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడలేదు. గజం రూ.75 వేల వరకు కొన్ని ప్రాంతాలలో పలికిందంటే ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు కొనుగోలుదారులకు కూడా ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొంది.
నట్టేట ముంచేలా
ఇప్పుడు ఇంకో విడత ఉందంటూ మంత్రి నారాయణ బహిరంగ ప్రకటనలు చేయడం, లీకులివ్వడం ప్రారంభించడంతో రైతులు, రైతు జేఏసీ ప్రతినిధులు, ఈ ప్రాంత వాసుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఇచ్చిన భూములు అభివృద్ధి చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే తాము లబ్ధి పొందవచ్చని ఆశిస్తుంటే మాకు తోడు మరో ఏడు గ్రామాలను చేర్చితే మా పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. భూములిచ్చి 10 సంవత్సరాలు దాటింది. ఇంతవరకూ రిటర్నబుల్ ప్లాట్లు కాగితాలపైనే తప్ప భౌతికంగా ఎక్కడున్నాయో తెలియదు. కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేయలేదు, చేసిన వారికి బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. భూములను అభివృద్ధి చేసి రైతులను ఆదుకోకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. రైతు జేఏసీ పేరుతో గోడు వెళ్లబోసుకుందామంటే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. నిరసన తెలపడంతో త్రీమెన్ కమిటీ వేసి హడావుడిగా సమావేశం ఏర్పాటు చేశారు. అన్నీ విన్నా ఎన్ని సమస్యలు పరిష్కరిస్తారనేది తెలియడం లేదు.
జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ...
పల్నాడు, గుంటూరు జల్లాల్లోని రెండు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తారు. మరో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా విస్తరణకు వినియోగించుకోనున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల నుంచి 9,616 ఎకరాల భూమిని సమీకరిస్తారు. ఇందులో 7,465 ఎకరాలు రైతుల పట్టా భూములు, 97 ఎకరాలు అసైన్డ్ భూములు, 2,054.23 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. గుంటూరు జిల్లాలో 10,878 ఎకరాల భూమిని సమీకరిస్తుండగా, అందులో 9,097 ఎకరాలు రైతులకు చెందిన పట్టా భూములు, 7.01 ఎకరాలు అసైనన్డ్ భూములు, 1,774.07 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. గ్రామ సభల్లో పలువురు రైతులు దీనిని వ్యతిరేకించారు. తొలివిడత బాధిత 29 గ్రామాల రైతుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెదమద్దూరులో 1,018 ఎకరాల పట్టా భూముల సమీకరణ చేయనున్నారు. యండ్రాయి గ్రామ పరిధిలో 1,879 ఎకరాలు పట్టా, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, కర్లపూడి లేమల్లే గ్రామంలో 2,603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైనన్డ్ భూమిని సమీకరించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని 3 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. వడ్డమానులో 1,763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 అసైన్డ్ ల్యాండ్ సమీకరించనున్నారు. హరిశ్చంద్రాపురంలో 1,448.09 ఎకరాలు పట్టా, 2.29 అసైన్డ్ ల్యాండ్ సహా పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేయనున్నారు. 7 గ్రామాల్లో కలిపి పట్టా భూమి 16,562.52 ఎకరాలు, 104.01 ఎకరాల అసైనన్డ్ భూమిని సమీకరణ చేయనున్నారు. ఈ భూసమీకరణ బాధ్యతను సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మంత్రి నారాయణ పల్నాడు జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
హాఫ్‌పేటలో దిత్వా తుఫాన్ ఈదురు గాలులకు పూర్తిగా నేలవాలిన వరిపంట
7
రాజధాని పేరుతో అన్నదాతలపై మరోసారి భూ సమీకరణ పిడుగు పడింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పూలింగ్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అలజడి రేగిది. మరో ఏడు గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు రోడ్డున పడనున్నారు.
అదనపు భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంలా విస్తరించడానికి మేం వ్యతిరేకం. రాయపూడిలో మా కుటుంబంతో పాటు బంధువులు చాలామంది రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చాం. అప్పట్లో చెప్పింది వేరు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది వేరు. 10 సంవత్సరాలుగా మాతో ఆడుకుంటారనుకుంటే ఒక్క సెంటు కూడా ఇచ్చేవాళ్లం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యల వలన రాజధానిలో భూములకు ధరలు పూర్తిగా పడిపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే రాజధాని రైతులు త్వరలో తిరగబడి సత్తా చూపడం ఖాయం.
– చిలకా విజయ్ కుమార్,
రాయపూడి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
పూలింగ్‌పై ప్రభుత్వం నాడు చెప్పిందొకటి నేడు చేసేదొకటిగా ఉంది. అప్పుడు 33 వేల ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి, ఇప్పుడు మళ్ళీ అదనపు భూ సమీకరణ పేరుతో రెండో విడత, మూడో విడత కూడా ఉంటుందని మంత్రి నారాయణ వెల్లడించడం అనాలోచితం. అప్పుడే ఈ మాట చెప్పి సమీకరణ చేసి ఉంటే ఇవ్వాలో వద్దో ఆలోచించే వాళ్లమే కదా. అప్పుడు ప్రపంచాన్ని తలదన్నే రాజధాని అని ఇప్పుడు మున్సిపాలిటీ అనడంలో ఆంతర్యం ఏంటో ప్రభుత్వానికే తెలియాలి.
– కొప్పుల శేషగిరిరావు, దొండపాడు, రైతు
తొలివిడతలో భూములిచ్చిన వారికి ప్రధానంగా గ్రామ కంఠాల నిర్ధారణ, రిటర్నబుల్ ప్లాట్లు వీధిపోటు, వీధి శూల, జరీబు ప్యాకేజీ నిర్ధారణ వంటివి గత 10 సంవత్సరాలుగా తీరని సమస్యగానే మిగిలిపోయాయి. వీటిపై ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన త్రీమెన్ కమిటీ సమావేశంలో రైతులు గళమెత్తారు. అన్నీ విన్న కమిటీ ఆయా సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పింది. కానీ ఆచరణలో అది సాధ్యపడదని రైతులు చెబుతున్నారు. ఈలోగా రెండో విడత భూసమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. చంద్రబాబు మాటపై తొలి విడతకు ఆనాడు రైతులు అంగీకరించగా ఇప్పుడు రెండో విడతపై మాత్రం బాధితులు గుర్రుమంటున్నారు.
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


