హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు
తెనాలి: రక్తం కనబడకుండా, ఆయుధం కనిపించకుండా, హింస లేకుండా ఏ తెలుగు సినిమా అయినా వుందా? ఎంత దుర్మార్గమిది...! ఎంత సాంస్కృతిక నేరస్థులు వీళ్లు, సినిమాలు తీసేవాళ్లు...వేషాలు వేసేవాళ్లు అని ప్రముఖ రచయిత, కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. సినిమాల్లో ఒక్కోడు వందమందిని చంపటం, ఏ నేరారోపణ లేకుండా బయటకెలా వస్తారు... ఆలోచించాలని చెప్పారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో రెండురోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాన్ని శనివారం మండల తహశీల్దార్ కేవీ గోపాలకృష్ణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
బహుభాషా కోవిదుడు బొల్లిముంత శివరామకృష్ణ
తెనాలిటౌన్: బహుభాషా కోవిదుడు, అభ్యుదయ రచయిత, ఉద్యమనేత బొల్లిముంత శివరామకృష్ణ సేవలు ఆదర్శంగా తీసుకోవాలని అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు పిలుపునిచ్చారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం శనివారం ఎంతో వేడుకగా జరిగింది. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు రంగస్థల విశిష్ట కళా పురస్కారాన్ని, ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబుకు రూ.25వేల నగదు పురస్కారాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. చందు సుబ్బారావు నిర్వహణలో జరిగిన సభకు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, ప్రముఖ సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్, ఏఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అరవ రామకృష్ణ, వీజీకే ఫౌండేషన్ కార్యదర్శి తుమ్మల కిషోర్ బాబు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, నలజాల లోకేష్, మైనేని రాఘవ తదితరులు పాల్గొని ప్రసంగించారు. బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహాన్ని తెనాలిలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రంగస్థల విశిష్ట కళా పురస్కార గ్రహీత, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ రచనా పటిమ గురించి శోభన్ బాబు, ఊర్వశి శారద, ఎంతో చక్కగా వర్ణించారని అన్నారు. తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటుకు తన 25 వేల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరో పురస్కార గ్రహీత, ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. అనంతరం ఫౌండేషన్ తరపున గుమ్మడి గోపాలకృష్ణ, కొత్తపల్లి రవిబాబులకు కళా పురస్కారాలు, రూ. 25 వేల నగదు పురస్కారం అందజేశారు. అనంతరం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను దుశ్శాలువా,పూలమాల, మెమోంటోలతో సత్కరించారు. సభా కార్యక్రమానికి ముందు నంది పురస్కార గ్రహీత యం సైదారావు బృందంచే జుగల్ బందీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా తెనాలి మండల తహశీల్దార్ కె.వి. గోపాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలుగా, విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ (తిమ్మరుసుగా) దర్శకత్వంలో ప్రదర్శించిన ’భువన విజయం’ సాహితీ రూపకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు నటీ నటులు తమ తమ పాత్రలకు జీవం పోశారు.
కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్
హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు
హింసాత్మక సినిమాలు తీసేవాళ్లు సాంస్కృతిక నేరస్తులు


