
ఇన్‌స్పైర్ రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలు రేకెత్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ మానక్ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులతో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించాలని గుంటూరు జిల్లా ఉపవిద్యాశాఖాధికారి జి.ఏసురత్నం పేర్కొన్నారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్‌లోని జిల్లా పరీక్షా భవన్‌లో ఇన్‌స్సైర్ మానక్‌పై డివిజన్ పరిధిలోని సైన్సు ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్సు అధికారి షేక్ గౌసుల్‌మీరా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసురత్నం మాట్లాడుతూ భావి శాస్త్రవేత్తల రూపకల్పనకు నాందిగా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ప్రాథమికోన్నత బడుల నుంచి మూడు, ఉన్నత పాఠశాలల నుంచి ఐదు, హైస్కూల్ ప్లస్ నుంచి ఏడు చొప్పున నామినేషన్లు పంపాలని స్పష్టం చేశారు. పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా సైన్సు అధికారి షేక్ గౌసుల్‌మీరా, రీసోర్సు పర్సన్లు డి. శివ శంకరరావు, డీవీ రమణ, పి. మల్లికార్జునరావు, ఎం.అప్పారావు, గంగాధర్ పాల్గొన్నారు.