
వృద్ధురాలు హత్య
లక్ష్మీపురం: వృద్ధురాలిని కొట్టడంతో కింద పడి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం గుజ్జనగుండ్లలో చోటు చేసుకుంది. పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జనగుండ్ల ప్రాంతానికి చెందిన ఆకుల అంజమ్మ (70)కు కుమార్తె ఉప్పాల త్రివేణి ఉంది. త్రివేణికి తారకరామనగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి స్నేహితురాలు. ఇద్దరు కలిసి బంగారం తాకట్టు పెట్టిన వ్యవహారంలో మనస్పర్థలు వచ్చాయి. లక్ష్మీతో త్రివేణి భర్త దురుసుగా ప్రవర్తించాడు. ఆమెకు సర్దిచెప్పడానికి త్రివేణి గుజ్జనగుండ్లకు వెళ్లింది. ఆ సమయంలో లక్ష్మి బయటకు వెళ్లగా.. ఆమె తల్లి అంజమ్మ ఉంది. త్రివేణిని చూడగానే ఆమెను దుర్భాషలాడింది. కోపంలో త్రివేణి ఆమెను చెంపపై గట్టిగా కొట్టడంతో కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న లక్ష్మీ వెంటనే పట్టాభిపురం పోలీసులకు సమాచారం తెలిపింది. వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై త్రివేణిలు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి, మృతదేహాన్ని జీజీహెచ్‌కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.