
దేశం గర్వించదగ్గ నేత బాబూ జగ్జీవన్‌రాం
పట్నంబజారు: దేశం గర్వించదగ్గ మహోన్నతుడు భారతరత్న బాబూ జగ్జీవన్‌రాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి కొనియాడారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జగ్జీవన్‌రాం వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ బిహార్‌లో జన్మించిన బాబు జగ్జీవన్‌రాం యావత్ దేశానికి సేవలు అందించారన్నారు. దేశంలో కరువు సమయంలో ఆహార శాఖ మంత్రిగా సవాళ్లను అధిగమించి పరిపాలన అందించిన గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు. రక్షణ శాఖ మంత్రి సైతం ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. ఆయన కారులో ప్రయాణం చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. నేటితరం ప్రజాప్రతినిధులు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పేదల పక్షాన పోరాడిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్‌రాం కృషి ఎనలేనిదని తెలిపారు. వారి ఆశయాలను వైఎస్సార్ సీపీ ముందుకు తీసుకెళ్తుందన్నారు.
జగ్జీవన్‌రాం స్ఫూర్తితో ముందుకు సాగుతాం..
పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ జగ్జీవన్‌రాం వంటి మహనీయులను చూసి గర్వపడాలో, కూటమి ప్రభుత్వంలో హత్యలకు గురవుతున్న దళిత నేతలను చూసి బాధపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో జగ్జీవన్‌రాం స్ఫూర్తితో ఎదిగిన నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మట్టుబెట్టాలని చూశారని ఆరోపించారు. బలహీన వర్గాలు పైకి రాకూడదని, దళిత వ్యతిరేకిగా ధూళిపాళ్ల నరేంద్ర పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు చేసినా జగ్జీవన్‌రాం వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ముందుకు సాగుతారని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వైఎస్సార్ సీపీ మాత్రమే చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాలకు అందిసుందని పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) కూడా ప్రసంగించారు. నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మండేపూడి పురుషోత్తం, నందేటి రాజేష్, తాడిబోయిన వేణుగోపాల్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, పఠాన్ సైదాఖాన్, పిల్లి మేరీ, ప్రభు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు
పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళి