
20న వైద్య కళాశాలలో రాష్ట్ర సదస్సు
గుంటూరు మెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), క్లినికల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ సొసైటీ (సీఐడీఎస్)లు సంయుక్తంగా వైద్యులలో శాసీ్త్రయ అవగాహనే లక్ష్యంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై వైద్య విద్యా సదస్సు నిర్వహించనున్నాయి. ఈ పోస్టర్‌ను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌యాదవ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై రాష్ట్రస్థాయి సద స్సు నిర్వహించటం అభినందనీయం అన్నా రు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ మాట్లాడుతూ జూలై 20వ తేదీన గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో ‘శాసీ్త్రయ అవగాహనతో.. వైద్యరంగం బాధ్యతతో.. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై యుద్ధం చేద్దాం – విజయం సాధిద్దాం’ పేరిట ఈ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోగంటి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరి రావు, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎం. సుభాష్ చంద్రబోస్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ తాతా సేవకుమార్, ఏపీఎంసీ సభ్యులు డాక్టర్ కేశవరావు బాబు, ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ జె.సి.నాయుడు, లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి.రాఘవ శర్మ తదితరులు పాల్గొన్నారు.