
అల్లూరికి నివాళి
గుంటూరు వెస్ట్: విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక నాజ్ సెంటర్ వద్ద గల ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో పాటు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నజీర్ అహ్మద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి త్యాగాలను నేటి యువత నిత్యం మననం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్టెప్ సీఈఓ చంద్రముని, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి పి.మురళి, అధికారులు పాల్గొన్నారు.
ఏపీ విపత్తుల నిర్వహణ
సంస్థ కార్యాలయంలో...
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతావనికి స్వేచ్ఛను అందించేందుకు ప్రజల్లో చైతన్యం నింపి, స్వాతంత్య్ర ఉద్యమానికి దివిటీగా మారిన సమరయోధుడు అల్లూరని కొనియాడారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఎవో శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరికి నివాళి