
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
లక్ష్మీపురం: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం 6వ రాష్ట్రస్థాయి అండర్ 10,12 విభాగాల్లో ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. జిల్లా బాలబాలికలు 4వ స్థానం సాధించారని జిల్లా ఫెన్సింగ్ అనానిమిషన్ ప్రధాన కార్యదర్శి డి. అశోక్‌బాబు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జులై 5 నుంచి 7వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ జరిగే జాతీయ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. బాలికల 11–12 విభాగంలో డి.జోష్ని, బి.శ్రీలక్ష్మి, యు.శ్వేత, ఫాఈల్‌లో ఎం.శ్లోక, ఆర్షియా హస్నా, సేబార్‌లో జి.హన్సిత, నాగశ్రీ ఎంపికై నట్లు తెలియజేశారు.
అండర్– 12 విభాగం సేబార్‌లో ఎం.చైతన్య సాయి, జె.పృథ్వి, వినయ్, బాలికల అండర్– 10 ఇప్పిలో బి.దీక్షిత, రాథోడ్, జి.తన్మయిశ్రీ , ఎం.స్నేహశీ, సేబార్‌లో సి.అరోహి, అండర్– 10 కేటగిరి బాలురు ఫాఈల్‌లో పి.రిశాంక్ శర్వాన్, పి.రిత్విక్ ఎంపికై నట్లు అశోక్‌బాబు వెల్లడించారు.