మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ వడ్డాది | Sakshi
Sakshi News home page

మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ వడ్డాది

Published Tue, May 21 2024 9:10 AM

మానసి

గుంటూరు మెడికల్‌: మానసిక వైద్య నిపుణుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ వడ్డాది వెంకటకిరణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీగా డాక్టర్‌ పసుపుల సాయికిరణ్‌, కోశాధికారిగా డాక్టర్‌ నెక్కంటి నిమిషా ఎన్నికయ్యారు. గుంటూరు జీజీహెచ్‌ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా డాక్టర్‌ వడ్డాది వెంకటకిరణ్‌, మిగతా ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేయడం గమనార్హం. జాయింట్‌ సెక్రటరీగా డాక్టర్‌ జి.జగదీష్‌ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని సోమవారం గుంటూరు జీజీహెచ్‌ మానసిక వ్యాధుల విభాగాధిపతి డాక్టర్‌ నీలి ఉమాజ్యోతి, పలువురు మానసిక వైద్య నిపుణులు అభినందించారు. మానసిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధుల బారిన పడకుండా చైతన్యం కల్పిస్తామని డాక్టర్‌ వెంకటకిరణ్‌ తెలిపారు. యువ వైద్యులు, వైద్య విద్యార్థులకు అకడమిక్‌ కార్యక్రమాల్లో భాగంగా ప్రతినెలా సీఎంఈలు నిర్వహించి వారిలో నైపుణ్యాన్ని పెంపొందిస్తామన్నారు. సంఘం బలోపేతం కోసం కృషి చేస్తామని వెల్లడించారు.

పోలింగ్‌ రోజు జరిగిన గొడవలపై విచారణ

తాడేపల్లిరూరల్‌: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధితోపాటు దుగ్గిరాల మండలంలో పోలింగ్‌ రోజు జరిగిన గొడవలపై డీఎస్పీ సీహెచ్‌ రవికాంత్‌ సోమవారం విచారణ చేపట్టారు. మే 13న పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద కొందరు గొడవలు సృష్టించి దాడులకు పాల్పడ్డారు. వారు ఏ పార్టీకి చెందిన వారు, జరిగిన గొడవలు ఏమిటి? ఎవరెవరు చేశారు? ఎంతమంది పాల్గొన్నారు అనే వివరాలను డీఎస్పీ సేకరించారు. కొందరు జూన్‌ 4న దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ముందుగానే పసిగట్టి అనుమానితులకు తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు పోలీసులు కసరత్తు చేపట్టారు. అనుమానితుల పేర్లు సేకరిస్తున్నట్టు సమాచారం.

మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ వడ్డాది
1/1

మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ వడ్డాది

Advertisement
 
Advertisement
 
Advertisement