జెడ్పీ ప్రగతి పద్దు | Sakshi
Sakshi News home page

జెడ్పీ ప్రగతి పద్దు

Published Sat, Nov 18 2023 1:58 AM

జెడ్పీలో స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్న  చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా   - Sakshi

గుంటూరు
శనివారం శ్రీ 18 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

విద్యాపీఠాన్ని సందర్శించిన ప్రభూజీ

తెనాలిటౌన్‌: గంగానమ్మపేటలోని విద్యా పీఠాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని శ్రీ సాయిథామ పీఠాదీశ్వరులు రామానంద ప్రభూజీ సందర్శించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.87.97 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు శుక్రవారం ప్రవేశపెట్టారు. చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన భేటీ అయిన ప్రణాళిక–ఆర్థిక స్థాయీ సంఘంలో ప్రతిపాదనలపై చర్చించి ప్రాథమిక ఆమోదం తెలిపారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో ఏడుస్థాయీ సంఘాలు భేటీ అయ్యాయి. వీటిలో ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, అభివృద్ధి పనులకు సంబంధించిన 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగాయి. వ్యవసాయంపై 3వ స్థాయీ సంఘం జెడ్పీ వైస్‌ చైర్మన్‌ శొంటిరెడ్డి నర్సిరెడ్డి, సీ్త్ర–శిశు సంక్షేమంపై 5వ స్థాయీ సంఘం తెనాలి జెడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి, సాంఘిక సంక్షేమంపై 6వ స్థాయీ సంఘం జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బత్తుల అనురాధ అధ్యక్షతన జరిగాయి. సమావేశాలకు సంఘాల సభ్యులతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

రూ.55.01 లక్షల మిగులు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.87.97 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఖర్చులను రూ.87.42 కోట్లుగా చూపిన అధికారులు, రూ.55.01 లక్షలు మిగులుగా చూపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్‌లో రాబడులు, ఆదాయాన్ని రూ.76,12,61,000గా ఖరారు చేసిన పాలకవర్గం వ్యయం, ఖర్చులను రూ.75,61,28,000గా చూపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జెడ్పీ బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖల ఖర్చులనూ కలిపి ఆమోదించాల్సి ఉన్నందున రూ.781 కోట్లను కొత్తగా చేర్చారు. దీంతో మొత్తం వార్షిక బడ్జెట్‌ రూ.869 కోట్లకు చేరింది. ఇందులో కేవలం జెడ్పీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రూ.87.97 కోట్లతో సిద్ధం చేసిన ప్రతిపాదనలను ప్రణాళిక–ఆర్థిక స్థాయీ సంఘం ప్రాథమికంగా ఆమోదిస్తూ వచ్చే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సమగ్రంగా చర్చించేందుకు నిర్ణయించింది.

15వ ఆర్థిక సంఘ నిధుల కోసం నిరీక్షణ

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించేందుకు 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర నిధుల కోసం జెడ్పీ పాలకవర్గం ఎదురు చూస్తోంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులను పొందుపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.40 కోట్లుగా చూపిన అధికారులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.45 కోట్లు రావచ్చునని అంచనా వేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని అంచనాలు వేశారు.

మూడు జిల్లాల డీఈఓలు,

ఆర్జేడీ గైర్హాజరుపై ఆగ్రహం

విద్య–వైద్యంపై జరిగిన స్థాయీ సంఘ సమావేశానికి మూడు జిల్లాల డీఈఓలతోపాటు ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు గైర్హాజరు కావడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి అధికారులు గైర్హాజరుకావడం తగదని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగళాయపాలెం జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎంను అకారణంగా సస్పెండ్‌ చేశారని లక్ష్మణరావు ఆరోపించారు. విద్యాశాఖాధికారుల గైర్హాజరుపై చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జోన్‌ ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు గుంటూరులో అందుబాటులో ఉండటం లేదన్నారు.

9

న్యూస్‌రీల్‌

నేటి నుంచి వెనిగండ్లలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు

పెదకాకాని: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు వెనిగండ్లలో నిర్వహించనున్నట్లు పీఈటీ, పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి బేరం మస్తాన్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం నంబూరు తిరుపతిరావు శుక్రవారం తెలిపారు. స్థానిక వేమన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో అండర్‌– 14 బాల బాలికల జట్లు పాల్గొంటాయని చెప్పారు. క్రీడాకారులు 13 జిల్లాల నుంచి సుమారు 480 మంది, 50 మంది కోచ్‌ మేనేజర్లు, 50 మంది జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు హాజరవుతారని వివరించారు. మూడు రోజుల పాటు లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతుల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.

జర్మనీలో ఉద్యోగ అవకాశాల నిమిత్తం యువతకు శిక్షణ

నెహ్రూనగర్‌(గుంటూరుఈస్ట్‌): జర్మనీలో ఉద్యోగ అవకాశాల కల్పన నిమిత్తం బీఎస్సీ నర్సింగ్‌ చదివిన యువతీ యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రైనింగ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ప్లేస్మెంట్స్‌ స్కిల్‌ కాలేజ్‌ ఫర్‌ హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ అండ్‌ నర్సస్‌ కార్యక్రమం ద్వారా డీడీయూజేకేవై శిక్షణ కార్యక్రమం ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. 20 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉండి బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 6302096189 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

రూ.87.97 కోట్లతో జిల్లా పరిషత్‌

బడ్జెట్‌ ప్రతిపాదనలు

ప్రణాళిక–ఆర్థిక స్థాయీ

సంఘంలో ప్రాథమిక ఆమోదం

వచ్చే సర్వసభ్య సమావేశంలో

సమగ్ర చర్చ

జెడ్పీలో భేటీ అయిన ఏడు

స్థాయీ సంఘాలు

మధ్యలో వెళ్లిపోయిన జెడ్పీటీసీ గుల్జార్‌ బేగం

కాకుమానులోని బాలికల హాస్టల్‌కు తాగునీటి వసతి కల్పనలో అధికారుల నిర్లక్ష్యంపై జెడ్పీటీసీ గుల్జార్‌ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి ఇదే సమస్యపై పదే, పదే సమావేశాల్లో ప్రస్తావిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోనందుకు నిరసనగా ఆమె సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. హాస్టల్లో తాగునీటి వసతి కోసం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించినప్పటికీ అధికారులు పనులు చేపట్టకపోవడంపై హెనీ క్రిస్టినాతోపాటు సీఈవో జె. మోహనరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement
 

తప్పక చదవండి

Advertisement