దుర్గగుడి కీలక విభాగాలలో తనిఖీలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కేఎస్‌ రామారావు తొలి సారిగా ఆలయంలోని కీలక విభాగాలను బుధవారం పరిశీలించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఇంజినీరింగ్‌ విభాగం, అకౌంట్స్‌ విభాగం, ఆర్జిత సేవల విభాగం, టోల్‌ ఫ్రీ కేంద్రం, దర్శన టికెట్ల విభాగాలను తనిఖీ చేశారు. ఆయా విభాగాల అధికారులతో మాట్లాడిన అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయా విభాగాలలో సిబ్బంది రోజు వారీ విధుల గురించి ఆరా తీయడమే కాకుండా పలు సూచనలు చేశారు. దుర్గగుడి ఈవోగా ఆయా విభాగాలకు నేరుగా వెళ్లి అధికారులను, సిబ్బందిని కలుసుకున్నట్టు ఈవో తెలిపారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top