చోరీల నియంత్రణపై నిఘా ఉంచాలి

మాట్లాడుతున్న జిల్లా ఆరిఫ్‌హఫీజ్‌, పక్కన ఏఎస్పీలు సుప్రజ, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు   - Sakshi

జిల్లా ఆరిఫ్‌హఫీజ్‌

నగరంపాలెం: రానున్న వేసవి దృష్ట్యా చోరీలను నియంత్రించేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ వినియోగంపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ ఆదేశించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్‌లో శుక్రవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తరచూ దొంగతనాలు జరిగే ప్రాంతాలలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా పోలీసుల పహారా ఉండాలని అన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌తో నేరాలు నియంత్రించవచ్చునని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలు, నాటు సారా, గంజాయి, గుట్కా, ఖైనీ తదితర నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చట్ట పరిధిలో వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంస పత్రాలు అందించారు. సమావేశంలో ఏఎస్పీలు కె.సుప్రజ (పరిపాలన), ఎ.శ్రీనివాసరావు (క్రైం), కె.కోటేశ్వరరావు(ఏఆర్‌), ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ ఎన్‌.అన్నపూర్ణ, డీఎస్పీలు శ్రీనివాసరావు, సీతారామయ్య, పోతురాజు, ప్రకాష్‌బాబు, మెజేస్‌పాల్‌, చంద్రశేఖర్‌రావు, విజయశేఖర్‌, ఎస్‌బీ సీఐలు నరసింహరావు, శ్రీనివాస్‌రావు, డీసీఆర్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం, ఐటీ కోర్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top