దేశ గతిని మార్చిన పదేళ్ల పాలన | Sakshi
Sakshi News home page

దేశ గతిని మార్చిన పదేళ్ల పాలన

Published Sat, Jan 6 2024 3:32 AM

A ten year rule that changed the course of the country - Sakshi

దాదాపు పదేళ్లు పూర్తిచేసుకుని బీజేపీ ఆధ్వ ర్యంలోని కేంద్ర ప్రభుత్వం పాలనలో తనదైన ముద్రను వేసింది. గత ప్రభుత్వాలతో పోల్చు కుంటే విభిన్నమైన పాలన అందించింది. అవి నీతికి దూరంగా, ప్రజాధనం వృధా కాకుండా పెట్టిన ప్రతి పథకం అట్టడుగు స్థాయి పౌరుని వరకూ చేరింది. నరేంద్ర మోదీ ప్రధా నిగా ఈ పదేళ్ల పాలన మన దేశ గతిని పూర్తిగా మార్చి వేసింది. భారత్‌ నేడు ప్రపంచంలో నిర్ణయాత్మక శక్తిగా మారింది.

కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛభారత్‌ అభి యాన్‌’ కార్యక్రమం చేపట్టి  దేశవ్యాప్తంగా ప్రజలు తాముగా శుభ్రంగా ఉండటమే కాక, తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసు కోవడానికి శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కొన్ని కోట్ల మంది భారతీయులకు బ్యాంకు ఖాతాలే లేవు. అందుకే ‘ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన’ పథకం ద్వారా దాదాపుగా 50 కోట్ల మందికి ఉచిత బ్యాంకు ఖాతాలను కల్పించి వారిని దేశ ఆర్థిక కార్యకలాపాలలో భాగస్వాములను చేసింది కేంద్రం. ‘మేకిన్‌ ఇండియా’ పథకం ద్వారా దేశంలోనే వస్తూత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘జన సురక్ష బీమా యోజన’, ‘ముద్ర యోజన’ లాంటి కార్యక్రమాలతో సామాన్య ప్రజ లను ఆర్థిక కార్యకలాపాలలో భాగస్వాములను చేసింది.

‘ఉజ్వల’ పథకం కింద కోట్లాది మందికి సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్లను అందించింది. ‘స్కిల్‌ ఇండియా’ పథకంతో దేశంలోని యువతకు వివిధ రంగా లలో నైపుణ్య శిక్షణ అందించింది. రైతులకు ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం కింద ఏడాదికి రూ. 6000 అందిస్తోంది. ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం, పండించిన పంటలకు మద్దతు ధరను పెంచడం, పంట నష్టపోయిన రైతులకు ‘ఫసల్‌ బీమా యోజన’ కింద బీమా ప్రీమియం చెల్లించడం వంటివి రైతులకు ఎంతో మేలు చేకూర్చాయి. ‘పీఎం ఆవాస్‌ యోజన’ పథకం కింద గృహాలను నిర్మించడం, ‘పీఎం గతి శక్తి’ పథకం కింద వాయు రవాణా, జల రవాణా, రోడ్డు రవాణా మార్గాలను అభివృద్ధి చేయడం జరిగింది. 

స్వదేశీ పరిజ్ఞానంతో కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసి దాదాపుగా 102 కోట్ల మందికి 220 కోట్ల కరోనా టీకాలను ఉచితంగా అందించింది. ‘పీఎం గరీబ్‌ కళ్యాణ యోజన’ కింద దేశంలో ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా బియ్యాన్ని, నిత్యావసర సరుకులను అందించింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 21వ శతాబ్దపు యువతకు అనుగుణంగా ‘నూతన విద్యా విధానం– 2020’ను కేంద్రం తీసుకొచ్చింది. ఆర్థిక సంస్కరణలో భాగంగా జీఎస్టీ ప్రవేశ పెట్టింది. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసి జమ్మూ–కశ్మీర్‌ మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసు కున్నది.

ఈ కాలంలోనే అంతరిక్ష రంగంలో మన దేశం అగ్రరాజ్యాల సరసన చేరింది. నూతన పార్లమెంటు వేదికగా మహిళలను రాజకీయ రంగంలో క్రియాశీలం చేయడం కోసం 33 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును ఆమోదింపచేసింది. అయోధ్యలో అశేష హిందువులకు మోదం చేకూర్చుతూ న్యాయసమ్మతంగా రామాల యాన్ని నిర్మింపచేస్తున్నది. జి–20 దేశాల సదస్సు విజయవంతం కావడం మనందరికీ గర్వ కారణం. ‘మన్‌ కీ బాత్‌ ’ కార్యక్రమం ద్వారా నిరంతరం దేశ ప్రజలతో సంభాషిస్తూ ప్రజలకు ఏం కావాలో తెలుసు కుంటున్నారు ప్రధాని మోదీ.

వ్యాసకర్త ఏబీవీపీ తెలంగాణ మాజీ జాయింట్‌ సెక్రెటరీ
మొబైల్‌: 99081 86025
- డా‘‘ చింత ఎల్లస్వామి

Advertisement
 
Advertisement