Nerve Weakness Ayurvedic Tips: గుడ్లు, చేపలు ఎక్కువగా తింటున్నారా? దీనిలోని B12 వల్ల..

What Is Nerve Weakness, Know About Ayurvedic Tips And Best Diet To Prevent Nerve Weakness In Telugu - Sakshi

నరాల బలహీనతను నెర్వ్‌ పెయిన్‌ అని కూడా అంటాం. కొందరు వయసు పైబడితే ఈ సమస్య ఎదుర్కొంటే, మరికొందరికి బీపీ, షుగర్‌ వల్ల కూడా నరాలు బలహీనపడొచ్చు. ఇన్‌ఫెక్షన్లు, బాక్టీరియా వల్ల ఏర్పడే నష్టం నేరుగా నరాలపై ప్రభావం చూపుతుంది. హార్మోనల్‌ బ్యాలెన్స్‌ సరిగా లేకపోయినా నరాల వ్యవస్థ దెబ్బతింటుంది.

కళ్లు తిరగడం, నీరసంగా అనిపించడం, చర్మం వేడిగా ఉండటం వంటివి నరాల బలహీనతకు లక్షణాలు. మరి నరాల బలహీనత సమస్యను నివారించడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

సరైన సమయానికి భోజనం, విశ్రాంతి చాలా అవసరం

► నరాలు దెబ్బతినడానికి విటమిన్ B12 లోపం కారణం అవుతుంది. కాబట్టి ఈ విటమిన్‌ను తగినంత తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది.

► యాంటీ ఆక్సిడెంట్లు నరాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా బచ్చలికూర, ముదురు ఆకుకూరలు, బ్లూబెర్రీస్‌లో మెండుగా ఉంటాయి. ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది
► ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాల్మన్‌ చేపలు, గింజలు, అవిసె గింజలు, చియా సీడ్స్, ఆలివ్‌ నూనె వంటి వాటిలో ఒమేగా -3 ఎక్కువగా ఉంటుంది.


► ప్రాసెస్‌ చేయబడిన, చక్కెర ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి
► కూల్‌డ్రింక్స్‌ను ఎంత తగ్గిస్తే మన శరీరానికి అంత మంచిది
► పుష్కలంగా నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది
► విటమిన్ B12 లేదా ఒమేగా-3 వంటి కొన్ని పోషకాలు తప్పనిసరిగా శరీరానికి అందాలి. లేకపోతే డాక్టర్‌ సూచనతో సప్లిమెంట్స్‌ కూడా తీసుకోవచ్చు. 

డా.నవీన్ రాయ్,
ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు




 

Read also in:
Back to Top